మహేష్ తో భారీ సినిమాపై రాజమౌళి నుంచి మరిన్ని డీటెయిల్స్.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి అవైటెడ్ గా ఉన్న బిగ్గెస్ట్ కొలాబరేషన్స్ లో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ కూడా ఒకటి. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ భారీ కాంబినేషన్ ఎట్టకేలకు అనౌన్స్ కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ అయితే వచ్చే ఏడాదిలో పట్టాలెక్కనుంది.

ఇక ఈ భారీ చిత్రం ఏ రకంగా ఉంటుంది అనే దానిపై ఇది వరకే రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఓ ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడుతూ ఇచ్చిన మరిన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు బయటకి వచ్చాయి. నా నెక్స్ట్ సినిమా తెలుగులో హ్యుజ్ స్టార్ అయినటువంటి మహేష్ బాబుతో చేస్తున్నానని.

ఇది ఎప్పుడు నుంచో నేను చేయాలి అనుకుంటున్న అడ్వెంచర్ డ్రామా అని దీనికి మహేష్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటాడని చేస్తున్నామని తెలిపారు. అలాగే మరోసారి మాట్లాడుతూ ఈ చిత్రం తనకి ఇష్టమైన ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చారు. దీనితో మహేష్ పై ఈ కొత్త డీటెయిల్స్ మంచి ఆసక్తిగా మారాయి. ఇక ప్రస్తుతం అయితే మహేష్ దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ భారీ ఏక్షన్ ఎంటర్టైనర్ లో బిజీగా ఉన్నాడు.