అంతమంది అమ్మాయిల తర్వాత పాయల్ కి ఛాన్స్ వచ్చిందట..!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అనేది చిన్న విషయం కాదు. అందులోని మొదటి సినిమా తోనే మంచి హిట్ అందుకున్నాక ఆ హీరోయిన్ పరిస్థితి ఇంకా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వస్తే వరుస అవకాశాలు లేదంటే మంచి హిట్ కొట్టినప్పటికీ ఎలాంటి అవకాశాలు కూడా లేకుండా ఉండిపోతారు.

అయితే అలా టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే మంచి హిట్ ని అందుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా ఒకామె అని చెప్పాలి. మరి పాయల్ తన మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100 తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా ఆమె ఆ తర్వాత కొన్ని మంచి అవకాశాలు అందుకుంది అలాగే కొన్ని పేలవమైన సినిమాలు కూడా చేసింది.

కానీ ఇప్పుడు చేసిన ఓ సినిమాతో మాత్రం ఇప్పుడు గట్టి హైప్ ని మళ్ళీ తెచ్చుకుంది. కాగా ఆమె మొదటి సినిమా దర్శకుడు అజయ్ భూపతి తోనే చేసిన చిత్రం “మంగళవారం”. కాగా ఇదొక సుజ్రీ థ్రిల్లింగ్ ప్రాజెక్ట్ గా వస్తుండగా ఈ సినిమా విషయంలో ఆమె ఓ ఆసక్తికర ఫాక్ట్ ని చెప్పింది.

ఈ సినిమాకి ఆమె మొదటి ఛాయిస్ కాదట. ఆమె కన్నా ముందు ఏకంగా 40 మంది అమ్మాయిలని దర్శకుడు తన పాత్రకి ఆడిషన్ చేసాడని తెలిపింది. ఆ తర్వాత తానే అజయ్ కి కాల్ చేసి అడిగితే అప్పుడు తనకి ఈ సినిమాలో అవకాశం వచ్చింది అని ఆమె తెలిపింది. సో ఈ సినిమాకి పాయల్ కన్నా ముందు ఆమె పాత్రకి 40 మంది ముందున్నారట..