Pavan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుస సినిమాలను షురూ చేసారు. అజ్ఞాతవాసి వాసి సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న పవన్ మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇక మళ్ళీ వకీల్ సాబ్ సినిమా ద్వారా మళ్ళీ హాట్ కొట్టిన పవన్ వెంటనే భీమ్లా నాయక్ తో అభిమానులకు పండగ చేసారు. రీమేక్ సినిమాలను ఎక్కువగా తీస్తున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ అదే బాటలో ఇంకో రీమేక్ సినిమాను ఓకే చేసారు.ఇలా వరుస సినిమాలను చేస్తూ బిజీ అయ్యారు.ఇది ఇలా ఉంటే ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇంకా పవన్ లేటెస్ట్ గా స్పెషల్ రోల్ లో నటించే సాయి ధరమ్ తేజ్ – సముద్రఖని సినిమా, తర్వాత సినిమా వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో ఉంటుందని టాక్.
అయితే ఈ సినిమా లు ఉండగానే ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో “భవదీయుడు భగత్ సింగ్” షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “గబ్బర్ సింగ్” బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తూ ఉండటంతో పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ పోస్టర్… పవన్ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే.. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి దీనిలో పవన్ కళ్యాణ్ పాత్ర కు సంబంధించి ఒక వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.అదేంటంటే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించనున్న సినిమాలో ఆయన లెక్చరర్ గా కనిపించనున్నారట.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ భారీ సక్సెస్ ను అందుకోవడంతో.. ఈసారి కూడా పోలీస్ ఆఫీసర్ గా పవన్ ని పవర్ ఫుల్ గా చూపిస్తారని పవన్ ఫ్యాన్స్ ఆశించారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని మరింత పవర్ ఫుల్ గాచూపించడానికి హరీష్ రెడీ అయినట్లు సమాచారం.ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో,పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో ఎలా కనిపిస్తారో వేచి చూడాలి.
