ఆ స్టార్ హీరో తప్పుకోవడంతో ఏ మాయ చేసావే సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నాగచైతన్య?

ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత అక్కినేని నాగచైతన్య జంటగా నటించిన మొదటి చిత్రం ఏం మాయ చేశావే. ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై ఘట్టమనేని మంజుల నిర్మించిన ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26వ తేదీన విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచి ఎన్నో అవార్డులు దక్కించుకుంది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. 2010లో విడుదలైన ఈ సినిమా 12 సంవత్సరాలు పూర్తయిన కూడా ఎవరి గ్రీన్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాలో ని పాటలను ఇప్పటికీ ప్రేక్షకులు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నారు.

సమంత అక్కినేని నాగచైతన్య జంటగా నటించిన మొట్టమొదటి సినిమా ఇది. ఈ సినిమా ద్వారా వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా టాలివుడ్ లో మంచి గుర్తింపు ఏర్పరచుకున్నారు. అయితే ఈ సినిమాలో మొదటగా నాగచైతన్యకి బదులు టాలీవుడ్ స్టార్ హీరోలు ని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్ ఈ విషయం గురించి స్పందించాడు. ఏ మాయ చేసావే సినిమా కోసం మొదటగా మహేష్ బాబుని అనుకున్నానని.. కాకపోతే మహేష్ బాబు అప్పటికే పోకిరి లాంటి మాస్ అండ్ యాక్షన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవటం వల్ల ఇకపై ఆక్షన్ అండ్ మాస్ సినిమాలో మాత్రమే నటిస్తానని క్లాస్ సినిమాలు చేయాలని చెప్పాడు.

దీంతో గౌతమ్ మీనన్ ఈ సినిమా ద్వారా అక్కినేని నాగచైతన్యని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇలా మహేష్ బాబు ఏ మాయ చేసావే సినిమా నుండి తప్పుకోవటంతో నాగచైతన్య ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసి హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సమంత నాగచైతన్య మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఏమాయ చేసావే సినిమా సమంత, నాగచైతన్య జీవితాలను మలుపు తిప్పింది అని చెప్పటంలో సందేహం లేదు.