తులు భాషలో విడుదలకు సిద్ధమైన కాంతార… విడుదల ఎప్పుడంటే?

కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలోనే భూతకోల నేపథ్యం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతారా. ఈ సినిమా మొదటగా కన్నడ భాషలో సెప్టెంబర్ 30వ తేదీ విడుదల అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన అనంతరం మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఇతర భాషలలో కూడా విడుదల చేశారు.ఇలా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా వందల కోట్ల కలెక్షన్లు రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇప్పటికే తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలలో విడుదలైనటువంటి ఈ సినిమా మరోసారి తులు భాషలో కూడా విడుదల కావడానికి సిద్ధమవుతోంది.ఇప్పటికే ఈ సినిమాని తెలుగు భాషలో విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమాని డిసెంబర్ రెండవ తేదీ తులు భాషలో విడుదల చేయనున్నారు. కర్ణాటక ఆదివాసీల ఎంతో విశ్వసించే భూతకాల ప్రదర్శన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమాని కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోం భలే ఫిలిమ్స్ కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ఈ సినిమా అన్ని భాషలలో ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. కన్నడ భాషలో ఈ సినిమా కే జి ఎఫ్ 2 రికార్డులను కూడా చెరిపివేసింది. ప్రస్తుతం అన్ని భాషలలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులోకి వచ్చింది.ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని తెలుగు భాషలో విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ భాషలో ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.