‎Kantara Chapter 1: గేమ్ చేంజర్ రికార్డును బ్రేక్ చేసిన కాంతార.. మూడు రోజుల్లోనే ఏకంగా అన్ని కోట్లు!

‎Kantara Chapter 1: కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. కాగా ఈ మూవీ గతంలో విడుదల అయిన కాంతార మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇటీవల దసరా పండుగ కానుకగా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మొదటి రోజు రూ.89 కోట్ల గ్రాస్ సాధించిన కాంతార ఛాప్టర్ 1, మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల మార్క్‌ ను దాటేసింది.

‎ కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 162.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇలా మరోసారి వసూళ్ల వర్షం కురిపించి రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సికందర్ రూ. 110 కోట్లు, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రూ. 131 కోట్లు లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్‌ కలెక్షన్స్‌ ను కూడా దాటేసింది. అదే సమయంలో రూ. 150 కోట్ల మార్కును దాటేసిన నాల్గవ కన్నడ సినిమాగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది.

‎అంతేకాకుండా రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్1 విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు రూ. 22 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరిన్ని కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. మరి ముందు ముందు ఇంకా ఎలాంటి రికార్డులను సాధిస్తుందో చూడాలి మరి.