Kantara Chapter 1: ఆల్‌టైమ్ రికార్డులు బద్దలు కొడుతూ వరల్డ్ వైడ్ 818 కోట్ల మార్క్ దాటిన కాంతార ఛాప్టర్ 1

రిషబ్ శెట్టి ‘కాంతార ఛాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మైథాలజీ, జానపదం, యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం నాల్గవ వారం కూడా థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో కొనసాగుతోంది.

హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ మాగ్నమ్ ఓపస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.818 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.110 కోట్లకు పైగా సాధించడం విశేషం. దీంతో ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. అలాగే, KGF చాప్టర్ 2 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది.

కాంతార ఛాప్టర్ 1 అమెరికాలో కూడా దూసుకుపోతోంది. $5 మిలియన్ మార్క్ చేరువలో ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 31న ఇంగ్లీష్ డబ్ వెర్షన్ విడుదల కానుంది. షార్ఫ్ రన్‌టైమ్‌తో రాబోతున్న ఈ వెర్షన్ అంతర్జాతీయ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోనుంది.

MP Kesineni Chinni Vs Kolikapudi Srinivasa Rao | Chandrababu | Telugu Rajyam