బిజీ ప్రభాస్..ఆ ప్రముఖ బ్యానర్ లో సినిమా ఓకే చేశాడా?

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ భారీ క్రేజ్ ఉన్నటువంటి హీరో ప్రభాస్ అనేక భారీ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వీటిలో లోకల్ ప్రాజెక్ట్ ల నుంచి ఏకంగా వరల్డ్ ప్రాజెక్ట్స్ వరకు అయితే ప్రభాస్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రాల్లో అధికారికంగా ఇంకా అనౌన్స్ కాకుండా షూటింగ్ అవుతున్న చిత్రం అయితే దర్శకుడు మారుతీ తో ఉందని చెప్పాలి.

ఇప్పుడు సినిమా ఆల్రెడి ఓ షెడ్యూల్ కంప్లీట్  చేసుకోగా నెక్స్ట్ అయితే రెండో షెడ్యూల్ ని వచ్చే  వారం లో ప్లాన్ చేయనున్నారట. అలాగే ఇప్పుడు ఈ చిత్రం కన్నా ముందు అయితే నాగస్విన్ తో సినిమాకి బిజీగా ఉన్నాడు. మరి ఇలా కంప్లీట్ బిజీగా ఉన్న తాను మరో సినిమా ఓకే చేశాడా అనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.

హిందీ సహా తెలుగులో  “కాశ్మీర్ ఫైల్స్” రీసెంట్ గా “కార్తికేయ 2” భారీ హిట్స్ స్కోర్ చేసిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రభాస్ ని కలవడం ఉప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మరి దీనితో అయితే వీరి బ్యానర్ లో ప్రభాస్ సినిమా ఓకే చేశాడా అనే రూమర్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కొన్నాళ్ళు వేచి చూస్తే క్లియర్ అవుతుంది.