‘గల్లీ రౌడీ’ సెన్సార్ కంప్లీట్

Gully rowdy movie censor completed

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ ముందుండే యువ హీరో సందీప్‌ కిషన్‌ ప్రస్తుతం ‘గల్లీ రౌడీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఓటిటి వైపు చూడకుండా గల్లీ రౌడీ మూవీని థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించటం విశేషం. సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేశారు.

Gully rowdy movie censor completed

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో సందీప్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా ఆడిపాడింది. ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహ, పోసాని, వెన్నెల కిషోర్ కీలక పాత్రలలో నటించారు. సాయి కార్తీక్‌, రామ్‌ మిరియాలా సంగీతం అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘గల్లీ రౌడీ’ సినిమాను ఆగస్ట్‌ లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం.