గాసిప్స్ : “ఆదిపురుష్” కి మరింత పెరిగిన బడ్జెట్.!

రీసెంట్ గా పాన్ ఇండియా మార్కెట్ ల భారీ ట్రోల్స్ కి గురైన భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది డెఫినిట్ గా ప్రభాస్ నటిస్తున్న “ఆదిపురుష్” సినిమానే అని చెప్పాలి. ఈ సినిమాపై స్టార్టింగ్ ఇచ్చిన హైప్ కి చిత్ర యూనిట్ చూపించిన టీజర్ కి సంబంధమే లేకపోవడంతో ఒక్కసారిగా చిత్ర యూనిట్ కి ఆడియెన్స్ నుంచి షాక్ తగిలింది.

అయితే దెబ్బకి సినిమా రిలీజ్ ని వాయిదా వేసిన చిత్ర యూనిట్ నీస్ జూన్ కి రిలీజ్ ని అయితే తీసుకెళ్లిపోయారు. ఇక చేసేది ఏమీ లేక మళ్ళీ విజువల్స్ కోసం 100 కోట్లు అదనంగా నిర్మాతలు ఈ సినిమా కోసం కుమ్మరించారని కొన్ని రూమర్స్ రాగా తాజాగా మరో మరో 100 కోట్లు పెడుతున్నట్టుగా గాసిప్పులు మొదలయ్యాయి.

అయితే దీనితో ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 700 కోట్లకి వీళ్ళిపోయింది అని టాక్ ఇప్పుడు మొదలయింది. ఈ గాసిప్స్ కి ఏమో కానీ టీజర్ చూసాక అయితే అసలు ఈ సినిమాకి 100 కోట్లు కూడా పెట్టినట్టు అనిపించలేదు. ఇపుడు ఏమో ఏకంగా 700 కోట్లు అంటున్నారు. మరి ఇంత హంగామా చేస్తున్నప్పటికీ ఫైనల్ గా ఎలాంటి విజువల్స్ ని దర్శకుడు ఓంరౌత్ అండ్ కో రాబడతారో అనేది చూడాలి.