బిస్లరీతో ఒప్పందం కుదుర్చుకున్న గాడ్ ఫాదర్ మేకర్స్!

సాధారణంగా ఒక సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకువెళ్లాలంటే ఎన్నో విధాలుగా సినిమాని ప్రమోట్ చేయడం కోసం ఆలోచనలు చేస్తుంటారు.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడం ప్రెస్మీట్లో ఫ్రీ రిలీజ్ వేడుకలు నిర్వహిస్తూ సినిమాని ప్రమోట్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకి కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ సినిమా విజయదశమి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

మలయాళంలో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాగా రీమేక్ చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాని మరింతగా ప్రమోట్ చేయడం కోసం గాడ్ ఫాదర్ మేకర్స్ ప్రముఖ బిస్లరీ కంపెనీతో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే బిస్లరీ బిస్లెరీ ప్రతినిధి తుషార్‌ మల్హోత్రా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

తమ కంపెనీ గాడ్ ఫాదర్ మేకర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ తో ఒప్పందం కుదుర్చుకుందని ఈ ఒప్పందం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో పరిమిత వాటర్ బాటిల్స్ పై గాడ్ ఫాదర్ లేబుల్స్ తో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇలా చేయటం వల్ల రెండు సంస్థలకు భారీ స్థాయిలో మార్కెట్ జరుగుతుందని ఈయన తెలియజేశారు.మొత్తానికి గాడ్ ఫాదర్ సినిమాని ఇలా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.