యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇపుడు నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమాలలో కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మాస్ భారీ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి కేజీఎఫ్ లానే సెన్సేషనల్ ఫ్రాంచైజ్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా దీనిపై ఓ రేంజ్ హైప్ అయితే సెట్టయ్యింది.
కాగా ఈ సినిమా విషయంలో ఎప్పటి నుంచో టీజర్ విషయంలో అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఎపుడో కేజీఎఫ్ 2 రిలీజ్ తో అయితే సలార్ ఫస్ట్ గ్లింప్స్ రావాల్సి ఉంది కానీ అప్పట్లో రాలేదు. దీనితో అక్కడ నుంచి మరింత హైప్ సలార్ గ్లింప్స్ పై అయితే నెలకొన్నాయి.
కాగా ఇప్పుడు అయితే సలార్ టీజర్ పై క్రేజీ అప్డేట్ తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా టీజర్ డిజైన్ అయితే కంప్లీట్ అయ్యిపోయింది అట. టీజర్ కట్ ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్న మేకర్స్ ఇక దీనిని రిలీజ్ చేయానికి అయితే ఓ పర్ఫెక్ట్ టైం కోసం చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ టైం వస్తే ఇక సలార్ సెన్సేషన్ మొదలైనట్టే అని చెప్పాలి.
అలాగే ఎలాగో ఆదిపురుష్ సినిమా ప్రభాస్ నుంచి ఈ జూన్ 16న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. మరి దీనితో ఏమన్నా ప్రభాస్ బ్లాస్టింగ్ ట్రీట్ ఇస్తాడేమో చూడాలి. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు అలాగే ఈ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
