ఆ డైలాగ్స్‌కి నో చెప్పిన చిరంజీవి.!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’లో కొన్ని పొలిటికల్ డైలాగులు ప్రిపేర్ చేస్తున్నారట. అయితే, పొలిటికల్ టచ్ వున్న ఆ డైలాగుల్ని పెట్టొద్దని చిరంజీవి రైటర్స్‌కి సూచిస్తున్నారట.

ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కొన్నయినా పవర్ ‌ఫుల్ పొలిటికల్ డైలాగులయితే వుండబోతున్నాయనీ తెలుస్తోంది.

అయితే, డోస్ మరీ ఎక్కువ కాకుండా చిరంజీవి కంట్రోల్ చేస్తున్నారట. అంతేకాదు, అస్సలు పొలిటికల్ టచ్ లేకుండా డైలాగులుంటేనే బాగుంటుందని చిరంజీవి అనుకుంటున్నారట.

కథలో భాగంగా కొన్ని డైలాగులయితే తప్పడం లేదనీ తెలుస్తోంది. అయితే, ఆ పొలిటికల్ పంచ్ పవర్ ఏ స్థాయిలో వుండబోతోందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి సురేష్, చిరుకు చెల్లిలి పాత్రలో కనిపించనుంది.