బిగ్ న్యూస్ : ప్రభాస్ తో డేటింగ్ రూమర్స్ పై కృతి స్పందన ఇదే.!

గత కొన్ని రోజులు నుంచి కూడా సోషల్ మీడియాలో అలాగే టాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమా దగ్గర మంచి హాట్ టాపిక్ గా నిలిచిన అంశం ఏదన్నా ఉంది అంటే అది పాన్ ఇండియా హీరో ప్రభాస్ అలాగే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మధ్య డేటింగ్ రూమర్స్ అనే చెప్పాలి.

కృతి నటించిన లేటెస్ట్ సినిమా “బేడియా” ప్రమోషన్స్ లో కృతి సనన్ ప్రభాస్ తో డేటింగ్ లో ఉంది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని ఓ హింట్ వదలడంతో ఒక్కసారిగా ఇది బ్లాస్ట్ అయ్యింది. అయితే ఈ రెండు రోజులు మంచి హంగామా నడిచిన ఈ ఇష్యూ పై అయితే లేటెస్ట్ గా కృతి సనన్ తన స్పందన వెల్లడించింది.

భేడియా ప్రమోషన్స్ లో ఓ అంశం ఎటెటో వెళ్ళింది అది నాకు బాగా హిలేరియస్ గా అనిపించింది. అయితే నా వెడ్డింగ్, డేటింగ్ అంటూ వస్తున్న వార్తలపై అందరికీ ఓ క్లారిటీ ఇస్తాను.. ఇవన్నీ నిరాధార రూమర్స్ మాత్రమే వాటిలో ఎలాంటి నిజం లేదు అంటూ కుండ బద్దలు కొట్టింది.

దీనితో ఈ పెద్ద రూమర్స్ పై క్లారిటీ వచ్చింది. అయితే ఇలా మొదట్లో ఖండించి తర్వాత నిజం అయ్యినవి కూడా ఎన్నో లేకపోలేవు. మరి రాబోయే రోజుల్లో ఈ అంశం ఎక్కడ ఆగుతుందో చూడాలి.