ఏ పార్టీ వాడికైనా చిరంజీవిని చూస్తే అసూయనే… వైరల్ అవుతున్న నాగబాబు ట్వీట్!

మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు.ఇకపోతే బుల్లితెర కార్యక్రమాలలోనూ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉండే నాగబాబు మెగా ఫ్యామిలీ గురించి ఎవరైనా విమర్శలు చేస్తే పెద్ద ఎత్తున వారిపై తనదైన శైలిలో కౌంటర్స్ వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నిన్న జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా వెళ్లారు.అయితే మెగాస్టార్ చిరంజీవి అక్కడికి వెళ్ళగానే ఎంతోమంది అభిమానులు ఆయనతో కలిసి ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపించారు.

ఇకపోతే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవి పై కాస్త అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతుండగా ఈయన మాత్రం చిరంజీవిని ఉద్దేశిస్తూ చిరంజీవి ఫోటో సెషన్ ఆపి వస్తే నేను మాట్లాడతాను లేకపోతే ఇక్కడ నుంచి నాకు సెలవు ఇప్పించండి అంటూ చిరంజీవి పట్ల ఎంతో అసహనం వ్యక్తం చేశారు.

ఈ విధంగా గరికిపాటి మెగాస్టార్ చిరంజీవిని చూసి ఇలా అసహనం వ్యక్తం చేయగా ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అదేవిధంగా ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ పరోక్షంగా గరికపాటికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే అంటూ ట్విట్టర్‌లో రాసుకు వచ్చారు ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరాల్ గా మారింది.