అక్కినేని కుటుంబ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అడవి శేష్.. అక్కినేని కుటుంబ సభ్యుడు కాబోతున్నాడా..?

ఇటీవల డిసెంబరు 25వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా సామాన్య ప్రజలతో పాటు సెలబ్రెటీలు కూడా క్రిస్మస్ పండుగను చాలా ఘనంగా జరుపుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సెలబ్రిటీలు ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విడుదలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులకు కూడా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అక్కినేని కుటుంబంలో ఉన్న యువత అంతా కూడా క్రిస్మస్ సందర్భంగా ఫోటోలు తీసుకున్నారు. అయితే అక్కినేని కుటుంబం క్రిస్మస్ వేడుకల్లో అడవి శేషు కనిపించటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అడవి శేషు అక్కినేని కుటుంబానికి చెందిన సుప్రియ తో రిలేషన్ లో ఉన్నట్లు గత నాలుగు సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అడవి శేషు నటించిన గూడచారి సినిమాలో సుప్రిత నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని.. అప్పటినుండి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫోటోలలో అక్కినేని కుటుంబంతో అడవి శేషు కనిపించడం, అంతే కాకుండా సుప్రియ పక్కనే నిలబడి ఉండటంతో ఈ వార్తలు మరొకసారి ఊపందుకున్నాయి.

దీంతో అడవి శేష్ అక్కినేని ఇంటికి అల్లుడు కాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ ఇప్పటికి ఎందుకు పెళ్లి చేసుకోలేదని అందరికీ అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉండగా ఇదివరకే సుప్రియ కి వివాహాం జరిగి ఒక కూతురూ కూడా ఉంది. చాలా కాలం క్రితం సుప్రియ తన భర్త నుండి విడాకులు తీసుకొని కూతురితో కలసి జీవిస్తోంది. ఇలా సుప్రియ కి ఇదివరకే పెళ్ళి జరగటం, అంతే కాకుండా శేషు కన్నా సుప్రియ 6 సంవత్సరాలు వయసులో పెద్దది కావటం వల్ల వీరి పెళ్లికి శేషు కుటుంబసభ్యుల నుండి అంగీకారం లభించలేదని తెలుస్తోంది. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.