Sumanth: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో అక్కినేని వారసుడు సుమంత్ ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఈయన ఇండస్ట్రీలోకి వచ్చారు. కెరియర్ మొదట్లో పలు హిట్ సినిమాలలో నటించిన సుమంత్ అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఎంతో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో చేసే అవకాశం వస్తే ఈయన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇక త్వరలోనే సుమంత్ హీరోగా నటించిన అనగనగా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఈ సినిమా థియేటర్లో కాకుండా నేరుగా ఈటీవీ విన్ లో విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా మే 15వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో సుమంత్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఈయన ఒక కార్యక్రమంలో భాగంగా అక్కినేని హీరోలలో తనుకు నచ్చిన క్వాలిటీ గురించి తెలియజేశారు.
అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడుతూ నాగేశ్వర రావు గారితో నాకు తాత మనవడి రిలేషన్ కంటే కూడా తండ్రి కొడుకు రిలేషన్ ఉందని తెలిపారు. చిన్నప్పటి నుంచి ఆయన వద్దే పెరిగాను. సింపుల్ గా ఉండడం ఆయన నుంచి నేర్చుకున్నాను. ఎంత డబ్బు సంపాదించిన, ఎంత పెద్ద హీరో అయినా, సింపుల్ గా ఉండడం, ఆయనకే సాటనీ తెలిపారు. నాగార్జున గారి విషయానికి వస్తే నాగార్జున చాలా విభిన్నమైన సినిమా కథలను ఎంపిక చేసుకుంటారని తెలిపారు. అప్పట్లో చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున ఈ నలుగురు స్టార్ హీరోలుగా వెలిగారు. అయితే వీరంతా ఒకే ధోరణిలో సినిమా కథలను ఎంచుకోగా నాగార్జున మాత్రం చాలా విభిన్నంగా సినిమాలను ఎంపిక చేసుకునేవారని తెలిపారు.
ఇలా తన కుటుంబంలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ తనకు మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అంటూ ఈయన షాకింగ్ కామెంట్లు చేశారు..చిన్నప్పుడు తాతగారు సినిమాల కన్నా ఎక్కువ సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమాలు ఎక్కువ చూసేవాణ్ణి. ఆయనంటే నాకు ఎక్కువ అభిమానం ఉండేది. ఆ తరువాత ఆయన కొడుకు మహేష్ బాబు అంటే నాకిష్టమని సుమంత్ చెప్పడంతో అక్కినేని ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.