Akkineni Family: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు సినీ ఇండస్ట్రీకి మార్గదర్శిగా ఉన్నారు ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న అక్కినేని నాగేశ్వరరావు లెగసిని ఆయన కుమారుడు నాగార్జున కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక నాగార్జున ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక ప్రస్తుతం నాగార్జున వారసులుగా నాగచైతన్య అఖిల్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఏమాత్రం హిట్టు లేనటువంటి అక్కినేని కుటుంబంలో ఇటీవల నాగచైతన్య తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో అక్కినేని అభిమానులు కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా విడుదలకు ముందు నాగచైతన్య నటి శోభితను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అదే విధంగా తన రెండో కుమారుడు అఖిల్, జైనాబ్ నిశ్చితార్థం కూడా జరిగినట్లు నాగార్జున తెలియజేశారు. ఇలా తన చిన్న కుమారుడు కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వీరి పెళ్లి తేదీ కూడా అక్కినేని కుటుంబ సభ్యులు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
నవంబర్ నెలలో చాలా సింపుల్గా బిజినెస్మెన్ కుమార్తె అయినటువంటి జైనాబ్ తో నిశ్చితార్థం జరుపుకున్న అఖిల్ మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే కుటుంబ సభ్యులు మార్చి 24వ తేదీ వీరి వివాహం జరిపించడానికి ముహూర్తం కూడా ఖరారు చేశారని తెలుస్తోంది. ఇలా అక్కినేని కుటుంబం నుంచి వరుసగా శుభవార్తలు రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.