Akkineni Family: సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అక్కినేని కుటుంబం కూడా ఒకటి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న నాగార్జున ,నాగచైతన్య అఖిల్ వంటి వారు ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నాగార్జున రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు ఇండస్ట్రీలో ఇతర సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఉన్నప్పటికీ నాగార్జున మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.
ఇలా నాగార్జున రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈయన సపోర్ట్ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉందని స్పష్టమవుతుంది. పరోక్షంగా పలు సందర్భాలలో నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా వైసిపికి అనుగుణంగా ఉండి నాగార్జున ఒక్కసారిగా పార్లమెంటులోనే టీడీపీ ఆఫీసులో కుటుంబంతో సహా కనిపించడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలు వైరల్ కావడంతో అసలు నాగార్జున పార్లమెంటులోని టీడీపీ ఆఫీసుకు వెళ్లడానికి గల కారణం ఏంటి అనే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ ఫోటోలు నాగచైతన్య శోభిత దంపతులతో పాటు నాగర్జున అమల దంపతులు కూడా ఉన్నారు. ఇలా టిడిపి ఆఫీసుకు వెళ్లినటువంటి ఈయన అక్కడ కొంతమంది ఎంపీలను పలకరించి వారితో మాట్లాడారు. ఈ క్రమంలోనే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నాగార్జున కుటుంబంతో కలిసి ఫోటో దిగారు.
ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈరోజు పార్లమెంటులోని టిడిపి ఆఫీసులో నేను నాగార్జున అలాగే వారి కుటుంబ సభ్యులను కలిసాను అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. అయితే ఈయన ఇలా టిడిపి ఆఫీస్ కు వెళ్లడానికి కారణం లేకపోలేదని తెలుస్తుంది. ప్రముఖ తెలుగు సినీ నటుడు, దివంగత అక్కినేని నాగేశ్వరరావుపై రాసిన పుస్తక ఆవిష్కరణ కోసం నాగార్జున ఫ్యామిలీ ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తుంది.