“ఆదిపురుష్” తెలుగు విషయంలో మేకర్స్ నిర్లక్ష్యం?

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ హైప్ తో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి.. మరి ఈ భారీ సినిమా రామాయణ ఇతిహాస కావ్యం ఆధారంగా తెరకెక్కిస్తుండగా దర్శకుడు ఓంరౌత్ అయితే ఈ సినిమాని తెరకెక్కించి నిర్మాణం వహించారు.

మరి చిత్ర మేకర్స్ ప్రకారం సుమారుగా 600 కోట్ల వ్యయంతో తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో అయితే క్లిక్ అయ్యేలా కనిపించడం లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతంత మాత్రం లోనే ఉంది. అయితే లేటెస్ట్ గా సినిమా నుంచి హనుమాన్ జయంతి కానుకగా వచ్చిన తెలుగు పోస్టర్ విషయంలో అయితే మన వాళ్ళు అంత ఆనందంగా లేరు.

పోస్టర్ లో మెయిన్ ఎలిమెంట్స్ పక్కన పెడితే తెలుగు అక్షరాలా విషయంలో మేకర్స్ నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తుంది. ఏమాత్రం పొంతన లేకుండా ఆ అక్షరాలు డిజైన్ చేసి పోస్టర్ లో పెట్టేయడం మేకర్స్ కి ఈ సినిమా పట్ల ఉన్న శ్రద్ధ ని తెలుపుతుంది. ఎదో ఇంటర్నెట్ లో గూగుల్ నుంచి తీసుకొచ్చి నేరుగా పోస్టర్ లో పెట్టినట్టుగా ఉన్నాయని నెటిజన్స్ అంటున్నారు.

ఇలాంటి సినిమా విషయంలో ఇంత బ్లండర్స్ కేర్ లెస్ గా ఉండడం అనేది యూనిట్ నిర్లక్ష్యాన్నే చూపిస్తుంది. ఇప్పటికీ సినిమాపై అంత బజ్ లేదు ఉన్నది కూడా తగ్గిపోతుంది ఇక యూనిట్ కే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇక ఆడియెన్స్ లో ఎలా బజ్ ఏర్పడుతుంది?