నల్ల జీలకర్ర తీసుకోవడం వల్ల అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు.. ప్రమాదకర సమస్యలకు చెక్!

మనలో చాలామందికి నల్ల జీలకర్ర గురించి ఎక్కువగా అవగాహన ఉండదు. అయితే నల్ల జీలకర్ర వల్ల ఎన్నో అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందవచ్చు. జీలకర్రను దాదాపుగా అన్ని వంటలలో వాడతారనే సంగతి తెలిసిందే. నల్ల జీలకర్ర రుచిని కలిగి ఉండటంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో నల్ల జీలకర్ర సహాయపడుతుంది. నల్ల జీలకర్ర మలబద్ధకానికి చెక్ పెట్టడంతో పాటు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది.

నల్ల జీలకర్రతో తయారు చేసిన నూనెను నుదుటిపై రుద్దడం ద్వారా తలనొప్పి దూరం కావడంతో పాటు ప్రశాంతమైన నిద్రను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పంటికి, చిగుళ్లకు సంబంధించిన సమస్యలను దూరం చేయడంలో నల్ల జీలకర్ర తోడ్పడుతుంది. నల్ల జీలకర్రలో ఉండే థైమోక్విన్ అనే కెమికల్ చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు.

ఖాళీ కడుపుతో నల్ల జీలకర్రను తీసుకోవడం ద్వారా సులభంగా మెమొరీ పవర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ నల్ల జీలకర్ర నూనెలో ఉండే ప్రోటీన్లు, ఫాటీ ఆసిడ్స్ బ్లడ్ సర్క్యులేషన్ విషయంలో ఎంతగానో సహాయపడతాయని చెప్పవచ్చు. నల్ల జీలకర్ర మెటబాలిజంను మెరుగుపరచడంతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలను సైతం దూరం చేస్తుంది. పీరియడ్స్ టైంలో వచ్చే కడుపునొప్పిని దూరం చేయడంలో నల్ల జీలకర్ర సహాయపడుతుంది.

కంటి సంబంధిత సమస్యలను సైతం దూరం చేయడంలో నల్ల జీలకర్ర ఉపయోగపడుతుంది. నల్ల జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ ను దూరం చేయడంలో సహాయపడతాయి. నిమ్మరసం, నల్ల జీలకర్ర నూనెను ముఖానికి అప్లై చేయడం ద్వారా మొటిమలు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. రోజూ మధ్యాహ్నం రాత్రి సమయంలో అర టీ స్పూన్ నల్ల జీలకర్ర తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.