ఈ మధ్య కాలంలో అందం కోసం ఎక్కువ సమయం కేటాయించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చలికాలంలో మెరిసే చర్మం కావాలని భావించే వాళ్లు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మెరిసే చర్మాన్ని పొందవచ్చు. చలికాలంలో చర్మం బిగుతుగా మారడంతో పాటూ పొడి బారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చలిగాలి కారణంగా చర్మాన్ని రక్షించే నూనె తొలగిపోయి అనేక సమస్యలకు కారణం అవుతుందని చెప్పవచ్చు.
చలికాలంలో చర్మం హైడ్రేటెడ్ గా ఉండాలంటే శరీరానికి తగినంత నీటిని అందించాలి. బయటికి వెళ్లే సమయంలో సన్‌స్ర్కీన్ లోషన్‌ను వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఓట్స్ పౌడర్, 3 చెంచాల పాలు, ఒక చెంచా గ్లిజరిన్ ను ముఖానికి రాసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. 5 నిమిషాల పాటు ఈ విధంగా ఉంచడం ద్వారా చలికాలంలో మెరిసే చర్మం సొంతమవుతుంది.
రెండు చెంచాల పెరుగు, బీట్‌రూట్ రసం తీసుకుని ముఖంపై మసాజ్ చేసి మంచినీటితో శుభ్రం చేస్తే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల చర్మం మృదువుగా మారడంతో పాటు కాంతివంతంగా ఉంటుందని చెప్పవచ్చు. ముల్తానీ మట్టి, శనగ పిండి, బంగాళా దుంప రసంకు గ్లిజరిన్, కొన్ని పాలు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే మంచిది.
పొడి చర్మం ఉన్న వారు ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఇలాంటి ఫేస్ ప్యాక్ చేసుకోవడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు కూడా తొలగిపోయి చర్మం మెరుస్తుందని చెప్పవచ్చు. చలికాలంలో చర్మం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొత్త సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.