ఆరోగ్యానికి నడక మంచిదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎన్ని గంటలు నడువాలనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేకపోవడం వాకింగ్ విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే కనీసం 4,000 అడుగులు వేస్తే గుండె పనితీరు బాగుంటుందని పోలాండ్ పరిశోధకుల పరిశోధనలలో వెల్లడైంది. 2,27,000 మందిపై జరిపిన అధ్యయనంలో నడక వల్ల కలిగే ప్రయోజనాలపై ఆసక్తికర విషయాలు వెల్లడి కావడం జరిగింది.
పోలాండ్‌లోని మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ లాడ్జ్‌కు చెందిన పరిశోధకులు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. రోజుకు 4,000 అడుగులు వేస్తే ఆరోగ్య సమస్యలతో మరణించే ముప్పు తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. 4000 అడుగులు వేయడం సాధ్యం కాని వారు 2,337కు పైగా అడుగులు వేసినా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అధ్యయనాలు చెబుతుండటం గమనార్హం.
పాజిబిలిటీ ఉంటే రోజులో కనీసం 10,000 కంటే ఎక్కువ అడుగులు వేస్తే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. ప్రతిరోజూ వాకింగ్ చేసే వాళ్లకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఉండవు. ఎక్కువ అడుగులు వేసిన వాళ్లకు జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులు సైతం వచ్చే అవకాశాలు కచ్చితంగా తగ్గుతాయని చెప్పవచ్చు. నడక సర్వరోగ నివారిణి అని చెప్పవచ్చు.
ఇప్పటివరకు నడకకు దూరంగా ఉన్నవాళ్లు ఇకపై అయినా ఆ అలవాటును మార్చుకుంటే మంచిదని చెప్పవచ్చు. నడక వల్ల లాభమే తప్ప నష్టం లేకపోవడంతో నడకను అలవరచుకుంటే మంచిదని చెప్పవచ్చు. నడక వల్ల నష్టాలు అయితే ఉండవని చెప్పవచ్చు.