మట్టికుండలోని నీళ్లు తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇలా మాత్రం తాగొద్దంటూ?

మనలో చాలామంది వేసవికాలంలో మట్టికుండలోని నీళ్లు తాగడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. మట్టికుండలోని నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరంలో పీహెచ్ స్థాయిలను కంట్రోల్ చేసే విషయంలో కుండలోని నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కుండలోని నీళ్లు జీర్ణ వ్యవస్థను ఫిట్ గా ఉంచడంతో పాటు వడదెబ్బ నుంచి రక్షిస్తాయి. అయితే మట్టి కుండలో నీళ్లు తీసుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

కుండను సరిగ్గా శుభ్రం చేయని పక్షంలో కుండలో ఫంగస్ చేరే అవకాశం ఉంటుంది. ఫంగస్ వల్ల కొన్ని సందర్భాల్లో కుండలోని నీళ్లు కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి నీళ్లు తాగడం వల్ల లాభం కంటే నష్టం కలుగుతుంది. ఇలాంటి నీళ్లు ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. అయితే ఈ సమస్య తప్ప కుండలోని నీళ్లు తాగడం వల్ల లాభాలే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. కుండలోని నీళ్లు జీవక్రియలను పెంచడంతో పాటు మెటబాలిజంను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలోని వేడిని తగ్గించడంలో కుండనీళ్లు ఉపయోగపడతాయి. కుండలోని నీళ్లు తాగడం వల్ల శరీరంకు అవసరమైన పోషకాలు కచ్చితంగా దక్కుతాయని చెప్పవచ్చు.

కుండలోని నీళ్లు గొంతు సంబంధిత సమస్యలను తగ్గించడంలో తోడ్పడతాయి. ఎసిడిటీ సమస్యలకు చెక్ పెట్టడంలో కుండ నీళ్లు ఉపయోగపడతాయి. శరీరం డీ హైడ్రేట్ కాకుండా మట్టి కుండలోని నీళ్లు ఉపయోగపడతాయి. ఇమ్యూనిటీని పెంచడంలో కుండ నీళ్లు ఉపయోగపడతాయని చెప్పవచ్చు.