Summer Tips: వేసవిలో బాడీలోనే టెంపరేచర్ తగ్గాలంటే ఇలా చేయాల్సిందే!

వేసవికాలం వచ్చింది అంటే చాలు ఎండలు మండిపోతుంటాయి. వాతావరణం వేడిగా ఉండడంతో పాటుగా ఆ వేడికి మన శరీరం కూడా మరింత వేడెక్కుతూ ఉంటుంది. దాంతో మన బాడీలో టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. అయితే వేసవిలో మన బాడీని కూల్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే బాడీ తొందరగా డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. అందుకే వేసవిలో బాడీ టెంపరేచర్ తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి వేసవిలో బాడీ టెంపరేచర్ తగ్గాలంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎండాకాలంలో నీటిని ఎక్కువగా తీసుకోవాలి.

ఫ్రిజ్ వాటర్ కంటే సాధారణంగా చల్లబరిచిన నీరు, సాధారణంగా వేడి ఉన్న నీటిని తీసుకోవాలి. ఇది శరీర అవయవాలకు శక్తిని, కణాలకు పునరుజ్జీవనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కుండలో నీరు అయితే ఆరోగ్యానికి ఇంకా మేలు చేస్తుంది. ఈ నీటిలో నిమ్మరసం కలపడం, పుదీనా రసం, మజ్జిగ మొదలైనవి కలిపి తీసుకోవచ్చు. వేడివేడి డ్రింక్స్ వద్దు. వేడి నీటి స్నానాలు మానుకోవడం మరింత మంచిది. ఎండాకాలంలో పిత్తం పెరుగుతుంది. కాబట్టి, వేడి పెరుగుతుంది. ఈ వేడిని చల్లబరిచేందుకు పండ్లు, కూరగాయలను తీసుకోవాలి.

పుదీనా, కొత్తిమీర, దోసకాయ, గుమ్మడికాయ, క్యాబేజీ, మెంతులు, సోంపు, బెర్రీస్, పుచ్చకాయల వంటివి కూడా తీసుకోవచ్చు. అలాగే వేసవికాలంలో దొరికే ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోవాలి. ఎండాకాలంలో మీకు అంతగా ఆకలి అనిపించదు. కాబట్టి, సూప్ రూపంలో తీసుకోవాలి. తేలికపాటి ఫుడ్స్ తీసుకోవాలి. వేడి ఉష్ణోగ్రతల నుండి శరీరం ఇప్పటికే అలసిపోతుంది. కాబట్టి అదే సమయంలో ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే అది జీర్ణమయ్యేందుకు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. దీని కోసం తీపి, చేదు, పుల్లని ఫుడ్స్‌ని తీసుకోవడం మానేయాలి. మీరు ఎక్కువగా తాగడంతో పాటు పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. అలా అని కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకూడదు. కేవలం పండ్ల రసాలు మాత్రమే తీసుకోవడం మంచిది. అదే విధంగా, ఈ సీజన్‌లో ఫుడ్ కచ్చితంగా తీసుకోవాలి. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండవద్దు. టైమింగ్స్ ఫాలో అవ్వాలి. లేదంటే, అసిడిటీ, జీర్ణ సమస్యలు, తలనొప్పి, వేడి పెరగడం వంటి సమస్యలు వస్తాయి.