చలికాలంలో తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో వేడి ఆహారం, వేడి నీళ్లు తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. వేడినీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే కొంతమంది చలికాలంలో అదే పనిగా వేడినీటిని తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే ఛాన్స్ ఉంటుంది.
ఎల్లప్పుడూ వేడినీటిని తీసుకోవడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. వేడినీటిని ఎక్కువగా తీసుకోవడం పొట్టకు హాని చేస్తుంది. వేడి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల నోరు, గొంతు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. హాట్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల దంత సమస్యల బారిన పడే ఛాన్స్ ఉంటుంది.
చలికాలంలో వేడినీళ్లు తాగడం వల్ల కొన్ని లాభాలు ఉన్నప్పటికీ ఎక్కువగా నష్టాలు ఉన్నాయి. చలికాలంలో సహజంగానే బద్ధకంగా, నీరసంగా ఫీలవుతాము. వాతావరణం చల్లగా ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి రోగనిరోధక శక్తి బలహీనమయ్యే అవకాశాలు ఉంటాయి. తరచూ జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది.
అల్లం, నిమ్మకాయ రెండూ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. నిమ్మకాయలోని సి-విటమిన్ వ్యాధులను వ్యాప్తిచేసే బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడుతుంది. ఒక గిన్నెలో రెండు చిన్న అల్లం ముక్కలు వేసి, అందులో ఒక గ్లాసు మంచినీళ్లు పోసి బాగా మరిగించాలి. ఈ నీళ్లను వడబోసి అందులో రెండు చెంచాల నిమ్మరసం కలిపి వేడిగా తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు.