ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యానికి ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారో అందానికి సైతం అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారు. కొంతమంది చిన్న వయస్సులోనే ముడతలు, మచ్చల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు చిన్న సమస్యలలా అనిపించినా శరీరంపై మచ్చలు రావడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు విటమిన్ లోపాల వల్ల కూడా మచ్చలు ఏర్పడే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఎన్ని చిట్కాలు పాటించినా మచ్చలు మాత్రం తగ్గడం లేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ముడతల వల్ల కొన్నిసార్లు చిన్న వయస్సులోనే పెద్ద వయస్సు వారిలా కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. కొన్నిసార్లు ఈ మచ్చలను తగ్గించుకోవడానికి ఉపయోగించే కాస్మోటిక్స్ వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
ప్రతిరోజూ 10 బాదం పప్పులను తినడం ద్వారా కూడా మంచి ముఖంపై మచ్చలు రాకుండా ఉంటాయి. అయితే పరిమితంగా తీసుకుంటే మాత్రమే ఈ హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. విటమిన్ – ఇ తోపాటు అనేక పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్న బాదాం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే వైద్యులను సంప్రదించాలి.
శరీరంపై, ముఖంపై ఉండే తెల్ల మచ్చల వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతుందని చెప్పవచ్చు. తెల్లమచ్చలు ఉన్నచోట పొప్పడి బాగా రుద్దడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వేపాకులు, కలబంద, అల్లం, గ్రీన్ టీ ద్వారా కూడా తెల్ల మచ్చల సమస్యను దూరం చేసుకోవచ్చు. తెల్ల మచ్చల సమస్యతో బాధ పడేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.