జామపండ్లు తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. తింటే ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయా?

మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తినే పండ్లలో జామ పండ్లు కూడా ఒకటి. జామ పండ్లను పేదవాడి యాపిల్ అని కూడా పిలుస్తారనే సంగతి తెలిసిందే. యాపిల్ పండులో ఎక్కువ మొత్తంలో పోషకాలు ఏ విధంగా ఉంటాయో జామ పండులో కూడా పోషకాలు అదే విధంగా ఉంటాయి. ఈ పండులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. గర్బిణీ స్త్రీలు, పాలిచ్చే మహిళలు జామ పండ్లను తినే ముందు వైద్యుల సలహాలను తీసుకోవాలి.

జామపండ్లలో ఉండే కొన్ని రసాయనాల వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎగ్జిమా వంటి చర్మ సమస్యలకు జామ పండ్లు కారణమవుతాయని చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉన్నవాళ్లు జామ పండ్లను తీసుకోకూడదు. ఏదైనా శస్త్ర చికిత్స చేయించుకున్నవారు జామ పండ్లను తినడం తగ్గించాలి. జామపండ్లు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయి.

తినే ముందు బాగా శుభ్రం చేసుకుని జామ పండ్లను తీసుకుంటే మంచిది. జామ పండ్లను ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి కొన్ని కెమికల్స్ ను వాడతారు. ఆర్గానిక్ జామపండ్లను తినడం వల్ల శరీరానికి లాభం చేకూరుతుందని చెప్పవచ్చు. జామ పండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. మలబద్ధకం సమస్యతో బాధ పడేవాళ్లు జామ పండ్లను తీసుకుంటే మంచిది.

జామపండ్లు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు విటమిన్ సి లభిస్తుంది. జామపండులో ఉండే విటమిన్ ఎ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పవచ్చు. జామపండ్లు తినడం వల్ల అలర్జీ, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జామపండ్లు తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.