మనలో చాలామంది ఎంతో ఇష్టంగా అరటిపండ్లను తింటారనే సంగతి తెలిసిందే. అరటిపండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఏ సీజన్ లో అయినా అందుబాటు ధరలలో ఉండే పండ్లలో అరటిపండ్లు ముందువరసలో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అరటిపండ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు సైతం సులువుగా లభిస్తాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
అరటిపండ్లు సులువుగా జీర్ణం కావడంతో పాటు మలబద్ధకం లాంటి ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. అయితే కొంతమంది పాలు, అరటిపండ్లను కలిపి తీసుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే పాలు, అరటిపండ్లు వేర్వేరుగా తీసుకుంటే ఎంతో లాభమని కలిపి తీసుకుంటే మాత్రం నష్టమని వైద్యులు చెబుతున్నారు. పాలు, అరటిపండ్లు కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.
పాలు, అరటిపండు కలిపి తీసుకుంటే శరీరంలో విష పదార్థాలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు అయితే ఉంటాయీ. ఇవి తీసుకోవడం వల్ల కఫం, అలర్జీ, జలుబు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అరటిపండ్లు, పాలు కలిపి తీసుకుంటే శరీరానికి ఎక్కువ కేలరీలు సరఫరా అయ్యే అవకాశాలు ఉంటాయి. పాలు, అరటిపండు కలిపి తింటే శరీరంలో శ్లేష్మం పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.
పాలు, అరటిపండు కలిపి తింటే అలర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిలను పెంచడంతో పాటు శరీరం బద్దకానికి లోనయ్యెలా చేస్తుంది. పిల్లలకు పాలు, అరటిపండ్లు కలిపి తినిపించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. పాలు, అరటిపండ్లు తీసుకోవడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.