మనకు ఎంతో చిత్రంగా విచిత్రమైన వస్తువులను కొనుగోలు చేయడమనేది కొందరికి హాబీగా ఉంటుంది. ఇటలీకి చెందిన మియామీ అనే బీచ్లో గోడకు అరటిపండును టేపుతో అతికించారు. అది అందర్నీ ఆకర్షితులను చేసింది. ఇకపోతే ఇందులో పెద్దగా విచిత్రమైనది ఏమీ లేదు ఒక సాధారణ అరటిపండును తీసుకుని టేపుతో గోడకు అతికించారు. కానీ కొనే వాళ్ళకు అదే పెద్ద వింతలా కనిపించింది. ఇంతకీ దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మరి ఎంతనుకుంటున్నారు రూన.85 లక్షలుగా ప్రకటించడం జరిగింది.
దీనిని ప్రముఖ కళాకారుడు మౌరీజియో క్యాటెల్యాన్ ఈ కళ(?) సృష్టించాడు. అంతేకాదండోయ్ దీనికి ఒక పేరును కూడా పెట్టాడు అదేంటో తెలుసా `కమెడియన్` అని చక్కటి పేరును పెట్టి అందర్నీ ఆకర్షితుల్ని చేశాడు. అతను మొత్తం మూడు అరటి పండ్లను ఈ విధంగా ప్రదర్శించగా రెండు ఇప్పటికే అమ్ముడుపోయాయి. అరటి పండు, టేపు కావాలంటే మనకు సాధారణ దుకాణాల్లో కూడా దొరుకుతాయి. అలాంటిది ఇంత డబ్బులు పోసి దాన్ని కొనుగోలు చేయాలా? అనే అనుమానం రావచ్చు. కానీ, ఇలా ఆర్ట్ గ్యాలరీలో.. పేరొందిన కళాకారుల ఆర్ట్స్ మధ్య ఠివీగా ఉండే అరటి పండు దొరకదు కదా అని వాదిస్తున్నారు. పైగా దీనికి సర్టిఫికెట్ ద్వారా హక్కులు కూడా కల్పిస్తున్నారు.
ఇకపోతే ఈ చిత్రాన్ని మియామీ బీచ్ వారు తమ ఇన్స్ట్రాగ్రామ్ పేజీల పోస్ట్ చేశారు. ‘‘నిజమైన అరటిపండును గోడకు అతికించిన క్యాటెల్యాన్.. మొదట్లో అరటి పండు రూపంలో కళాఖండాలను తయారు చేయాలని భావించాడు. అతను ఏ ప్రాంతానికి వెళ్లినా.. తన హోటల్ గదిలో అరటి పండును గోడకు అతికించేవాడు. దాని స్ఫూర్తితో అతను కంచుతో అరటి పండు కళాఖండాన్ని తయారు చేశాడు. చివరికి నిజమైన అరటి పండునే కళఖండంగా ప్రదర్శించాడు’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.