గడ్డి చామంతి మొక్కల్లో ఉండే ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే?

పల్లె వాతావరణంలో ఎక్కువగా కనిపించే గడ్డి చామంతి మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు ఎన్నో ఏళ్ల క్రితమే గుర్తించి అనేక వ్యాధులకు పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న గడ్డిచామంతి మొక్కను సంస్కృతంలో జయంతి వేద అని పిలుస్తారు. ప్రాంతాన్ని బట్టి ఈ మొక్కను పలకాకు, గాయపు ఆకు, తల నల్లారం వంటి అనేక పేర్లతో పిలుస్తుంటారు. పలకలాకు అంటే చాలామంది గుర్తుపడతారు ఎందుకంటే మనం చిన్నప్పుడు పలకను శుభ్రం చేసుకోవడానికి ఈ ఆకుని ఎక్కువగా ఉపయోగించే వాళ్ళం కాబట్టి. అయితే ఈ రోజుల్లో పిల్లలకు తెలియకపోవచ్చు.

గడ్డి చామంతి కలుపు మొక్క అయినప్పటికీ ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్,యాంటీ కోగ్యులెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటి రసాన్ని గజ్జి ,తామర, బొబ్బలు వంటి చర్మ వ్యాధులపై రాసుకుంటే వీటిలో ఉన్న ఔషధ గుణాలు కారణంగా తొందరగా నయం చేస్తుంది. గడ్డి చామంతి ఆకుల్లో యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల గాయాలను తొందరగా మారడానికి ఈ ఆకు రసాన్ని ఇప్పటికీ గ్రామాల్లో ఉపయోగిస్తుంటారు.నీటిలో ఉండే ఫ్లోరైడ్ని తగ్గించే గుణం గడ్డి చామంతి ఆకుల్లో ఉందని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

చిన్న వయసులోనే పట్టతల, జుట్టు తెల్లబడడం వంటి సమస్యలతో బాధపడే వారికి గడ్డి చామంతి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. గడ్డి చామంతి ఆకుల రసాన్ని తీసి తల వెంట్రుకలపై మర్దన చేసుకుంటే ఈ ఆకుల రసంలో ఉన్న యాంటీ మైక్రోబియన్ గుణాలు చుండు సమస్యను అరికట్టడంతో పాటు జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం వంటి సమస్యలను అరికడుతుంది.
గడ్డి చామంతి ఆకుల రసం తీసి తగినంత తేనె కలుపుకొని సేవిస్తూ వీటిలో ఉండే అలర్జీటీ లక్షణాలు దగ్గు ఆయాసం గొంతు నొప్పి లక్షణాలను దూరం చేస్తుంది.గ‌డ్డి చామంతిలో మొక్కల్లో ఆల్క‌లాయిడ్స్, ప్లేవ‌నాయిడ్స్, కెరొటినాయిడ్స్ తో పాటు క్యాల్షియం, సోడియం, పొటాషియం పుష్కలంగా ఉండి దీర్ఘకాలిక సమస్యలను కూడా దూరం చేస్తుంది.