మన చుట్టూ పరిసర ప్రాంతాలలో మనకు తెలియకుండానే ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు పెరుగుతూ ఉంటాయి అయితే వాటి ప్రాముఖ్యత తెలియక మనం వాటిని లైట్ తీసుకుంటాము. అయితే కొన్నిసార్లు ఆ మొక్కల ప్రాధాన్యత గురించి కనుక తెలిస్తే షాక్ అవుతూ ఉంటారు.కొన్ని రకాల మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండి ఎన్నో రకాల వ్యాధులను తగ్గిస్తూ ఉంటాయి అలాంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో రణపాలకు ఒకటి.ఈ మొక్క వేర్ల నుంచి మొదలుకొని కాండం ఆకులు వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.
ఈ రణపాల మొక్క ఆకులు, కాండం, వేర్లలో ఉన్న ఔషధ గుణాలతో కిడ్నీలో రాళ్ల సమస్యలు, లివర్ సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు,జీర్ణ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బు వంటి వందకు పైగా వ్యాధులను సునాయాసంగా నయం చేయవచ్చు.
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి రణపాల మొక్క దివ్య ఔషధం. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు సర్జరీ చేయించుకున్న ఫలితం ఉండదు. అలాంటివారు వారం రోజులపాటు ప్రతిరోజు ఉదయాన్నే ఒక రణపాల మొక్క ఆకును బాగా నమిలి లాలాజలంతో అలాగే మింగి గ్లాసుడు మంచినీళ్లు తాగాలి.
అరగంట వరకు ఏమీ తినకుండా ఉంటే కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు పడిపోతాయి. ఇలాగే 15 రోజులు పాటు చేస్తే శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేసుకోవచ్చు.రణపాల మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియన్ గుణాలు పుష్కలంగా ఉన్నందున మన శరీరంలోని క్యాన్సర్ కారకాలను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రణపాల మొక్కను ప్రతిరోజు పరగడుపునే బాగా నమిలి మింగిన తర్వాత మంచి నీళ్లు తాగి అరగంట వరకు ఏమీ తినకుండా ఉంటే అనేక క్యాన్సర్లను సమర్థంగా నిరోధిస్తుంది. ఇలా మూడు నెలలపాటు ప్రతిరోజు చేయాలి.