పచ్చిమిర్చిలో దాగున్న అద్భుతమైన ఔషధ గుణాలు.. తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే?

పచ్చిమిరపకాయ కూడా మన ఆరోగ్యాన్ని రక్షించడంలో చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. పచ్చిమిరపకాయను కేవలం వంటకాల్లో కారం రుచి కోసమే వాడతారని చాలామంది అనుకుంటారు. పచ్చి మిరపకాయలో మన శరీర పోషణకు అవసరమైన విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలతో పాటు మన ఆరోగ్యాన్ని రక్షించే ఔషధ గుణాలు మెండుగా లభిస్తాయి. పచ్చిమిరపకాయను తరచూ మన ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చిమిర్చిని మోతాదుకు మించి మన ఆహారంలో తీసుకుంటే అల్సర్, గ్యాస్టిక్, ఉబ్బసం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు, మరియు అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తవచ్చు. కనుక ప్రతిరోజు మన వంటకాల్లో తగిన పరిమాణంలో పచ్చిమిర్చిని ఆహారంగా తీసుకుంటే ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడుతుంది. పచ్చిమిర్చిలో క్యాప్సిన్ అనే మూలకం సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరించే హైపోథాలమస్ గ్రంధి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పచ్చి మిరపకాయలు ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. దీని కారణంగా మన శరీరంలోని ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అధికంగా జరిగి రక్తహీనత సమస్యను తొలగించి నీరసం, కళ్ళు తిరగడం, తిమ్మిర్లు వంటి సమస్యలు తగ్గుతాయి. పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. పచ్చిమిర్చిలో సమృద్ధిగా ఉండే బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచి అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది. పచ్చిమిర్చిలో ఉండే క్యాస్పేసియన్ అనే పదార్థం మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.