పల్లెల్లో పొలం గట్లపై ఎక్కువగా దర్శనమిచ్చే అవిసె మొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ మొక్కను సంస్కృతంలో అగస్త్య మొక్క అని పిలుస్తారు. ఆయుర్వేదంలో అవిసె మొక్కలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా అవిసె ఆకులు, గింజలు, బెరడు మరియు పువ్వుల్లో మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అవిసె ఆకులు మరియు పువ్వులతో రుచికరమైన కర్రీస్, ఫ్రై, పప్పు, సలాడ్స్ వంటి ఆహార పదార్థాలు తయారు చేసుకొని తినవచ్చు. అవిసె మొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
అవిసె ఆకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నందున వీటి రసాన్ని సేవిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది.మూత్రం పోసినప్పుడు మంట, మూత్రం ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు అవిసె ఆకు కషాయాన్ని సేవిస్తే మూత్రపిండాల పనితీరు మెరుగుపడి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి.సాధారణంగా చిన్నపిల్లల్లో కడుపులో నులి పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లలు తరచూ అనారోగ్యంతో బాధపడుతుంటారు. నులి పురుగు సమస్యను తొలగించుకోవడానికి అవిసె ఆకుల రసాన్ని తీసి అందులో కొద్దిగా తేనెను కలిపి తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
అవిసె గింజల్లో సమృద్ధిగా కాల్షియం ,ఐరన్ మెగ్నీషియం, విటమిన్ బి12, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి కావున అవిసె గింజలను చూర్ణంగా చేసి ప్రతిరోజు ఆవుపాలతో కలిపి ఉదయం సాయంత్రం సేవిస్తే మెదడు చురుగ్గా పనిచేసే జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. మరియు రక్తహీనత సమస్య తొలగిపోయి నీరసం అలసట వంటి లక్షణాలను బయటపడవచ్చు.రేచీకటి సమస్యతో బాధపడేవారు అవిసె ఆకులను మెత్తగా దంచిఆ మిశ్రమాన్ని కుండలో పోసి ఉడకబెట్టాలి. అందులో నుంచి రసాన్ని తీసి సేవిస్తే రేచీకటి సమస్య తొలగిపోతుంది.
గవద బిల్లలు, చర్మంపై దద్దర్లు వంటి సమస్యలతో బాధపడే వారికి అవిసె ఆకుల చూర్ణం చర్మంపై రాసుకుంటే అన్ని రకాల చర్మ సమస్యలు తొలుగుతాయి.విరోచనాలతో బాధపడేవారు అవిసె చెట్టు బెరడును కషాయంగా మార్చి సేవిస్తే విరేచనాల సమస్య తగ్గుతుంది.కీళ్ల నొప్పులు సమస్యతో బాధపడేవారు అవిసి ఆకులను లేదా పువ్వులను మెత్తని చూర్ణంగా మార్చి నొప్పి ఉన్న ప్రదేశంలో పట్టుగా వేసుకుంటే కీళ్లనొప్పి సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు.