మనలో కొంతమంది ఎముకల ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మరి కొందరు మాత్రం ఎముకల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కాల్షియంను తీసుకోవడం ద్వారా ఎముకలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.
50 సంవత్సరాల వయస్సు పైబడిన వారు ప్రతిరోజూ 1200 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పాలు, తమలపాకులో వేసే సున్నం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. గుడ్లు, చేపలు, బాదాం, సోయా బీన్స్ తీసుకోవడం ద్వారా కూడా శరీరంలో కాల్షియం తక్కువ సమయంలో పెరుగుతుంది.
రన్నింగ్, నడక, మెట్లు ఎక్కడం దిగడం ద్వారా ఎముకలలో బలం పెరుగుతుంది. జాగింగ్ వల్ల కాళ్లలో, పాదాలలో ఎముకలు గట్టి పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. చేపలు, కొబ్బరి పాలు, బ్రెడ్ శాండ్ విచ్ తీసుకోవడం ద్వారా ఎముకలు ఉక్కు అంత బలంగా మారతాయి. ఆకు కూరలు, నిమ్మ, బత్తాయి, సంత్రా రసాలు తీసుకోవడం ద్వారా కూడా ఎముకలు గట్టిపడతాయి.
కూల్ డ్రింక్స్, కుకీస్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.