వేసవి కాలం వచ్చిందంటే చాలామంది ఫ్రిడ్జ్ లోని కూల్ వాటర్ తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే కూల్ వాటర్ తాగడం వల్ల లాభమా? నష్టమా అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం నష్టమే అని వినిపిస్తోంది. ఎక్కువగా కూల్ వాటర్ తాగడం వల్ల కొత్త ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఫ్రిడ్జ్ లో వాటర్ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అరిథ్మియాను ఇది ప్రేరేపించడంతో పాటు వాసోస్పాస్మ్‌కు కూడా కారణం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద నీరు తాగడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. వేసవికాలంలో ఎక్కువ మొత్తంలో నీళ్లను తాగాలని శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు. దాహం వేసే వరకు ఎదురుచూడకుండా ప్రతి మూడు గంటలకు ఒకసారి నీళ్లు తాగితే మంచిది.
ఫ్రిడ్జ్ లో వాటర్ తో పోల్చి చూస్తే కుండలో వాటర్ తాగడం ద్వారా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ సొంతం అవుతాయని చెప్పవచ్చు. అతి చల్లని నీరు తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అతిగా చల్లని నీరు తాగేవాళ్లలో శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో పాటు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి.
మరీ కూల్ వాటర్ తీసుకోవడం వల్ల వెన్నుముకలోని నరాలు చల్లబడి మెదడును ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంటుంది. చల్లని నీటి వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరగడం కష్టంగా మారి బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. అతిగా కూల్ వాటర్ తాగితే ఆయాసం కూడా వస్తుంది. ప్రతిరోజూ కూల్ వాటర్ తాగేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.