ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొంది ఎంతో ఖరీదైన డ్రాగన్ ఫ్రూట్ ను తరచు మన ఆహారంలో తీసుకున్నట్లయితే ఊబకాయం,గుండెపోటు, హై బీపీ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ ను జ్యూస్ రూపంలో తీసుకోవడం కంటే పండు రూపంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రాగన్ ఫ్రూట్ లో మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ తో పాటు అత్యధికంగా ఫైబర్,ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు,కెరోటిన్,పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు,ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ లో సమృద్ధిగా లభించే ఫైబర్ జీర్ణ శక్తిని మెరుగుపరిచి మలబద్ధకం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్లో ఎక్కువగా లభ్యమయ్యే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ ను అభివృద్ధి పరుస్తుంది. తరచూ నీరసం అలసట కళ్ళు తిరగడం వంటి సమస్యలతో బాధపడేవారు డ్రాగన్ ఫ్రూట్ ను ఆహారంగా తీసుకుంటే ఇందులో పుష్కలంగా ఉన్న
ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ బి12 హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో సహాయపడి ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది తద్వారా రక్తహీనత సమస్య తొలగిపోతుంది.
షుగర్ వ్యాధితో బాధపడేవారు అత్యల్ప క్యాలరీలు అత్యధిక ఫైబర్ కలిగిన డ్రాగన్ ఫ్రూట్ ను ఆహారంగా తీసుకుంటే ఒంట్లో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి తద్వారా చక్కర వ్యాధినీ నియంత్రణలో ఉంచవచ్చు.డ్రాగన్ ఫ్రూట్ లో సమృద్ధిగా ఉన్న కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి మూలకాలు ఎముకల దంతాలద్రుడత్వానికి తోడ్పడి వృద్ధాప్యంలో వచ్చే నడుము నొప్పి కీళ్ల నొప్పుల సమస్యను తగ్గిస్తుంది.