మనలో చాలామంది గోర్ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే గోర్లు మన అరోగ్యానికి సంబంధించిన చాలా విషయాలను వెల్లడిస్తాయని చెప్పవచ్చు. గోళ్లు పసుపు రంగులో ఉంటే శరీరంలో పోషకాలు లోపించాయని అర్థం చేసుకోవాలి. గోర్లు పదేపదే విరిగిపోతున్నా కూడా పోషకాల లోపం కారణం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. పోషకాహార లోపంతో బాధ పడేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
గోళ్లు కెరాటిన్ అనే ప్రొటీన్‌తో తయారవుతాయనే సంగతి తెలిసిందే. శరీరంలో మాంసకృత్తులు లేనప్పుడు, గోర్లు బలహీనంగా ఉన్న సమయంలో గోర్లు పెళుసుగా మారే అవకాశం ఉంటుంది. గోరు పెరుగుదల, బలానికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్‌లను అందించడానికి ప్రోటీన్ అవసరమని చెప్పవచ్చు. కోడి మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
గోళ్లను బలోపేతం చేయడానికి, పెళుసుదనాన్ని నివారించడానికి బయోటిన్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. గుడ్లు, బాదం, వాల్‌నట్‌లు, సాల్మన్, అవకాడోస్, చిలగడదుంపలు, కాలీఫ్లవర్ తీసుకోవడం ద్వారా గోర్లు బలంగా అవుతాయి. ఇవి తీసుకోవడం ద్వారా అందమైన జుట్టు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు.
పొడి, విరిగిన గోర్లు కాల్షియం లోపాన్ని సూచిస్తాయి. ఆహారంలో తగినంత ఒమేగా -3 లేకపోతే అది గోర్లలో పగుళ్లకు కారణమవుతుంది. కొన్ని ఆహారాలు గోర్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆకు కూరల్లో క్యాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు గోళ్లు విరిగిపోకుండా కాపాడుతాయి. గోర్లు అందంగా కనిపిస్తాయి. ఆరోగ్యంగా ఉంటాయి.