తెలంగాణలో వైఎస్ షర్మిల సెల్ఫ్ గోల్.!

అయినా, పోలీసుల్ని కొట్టడమేంటి.? సర్వత్రా జరుగుతోన్న చర్చ ఇది. ఏ విషయంలో వైఎస్ షర్మిల సంయమనం కోల్పోయారు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పదే పదే తన రాజకీయ పర్యటనల్ని అడ్డుకునేలా అధికార భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం, పోలీసులు వత్తాసు పలుకుతుండడం.. ఇవే కారణాలా షర్మిల సంయమనం కోల్పోవడానికి.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కారు ఏం చేస్తోందో వైఎస్ షర్మిల తెలుసుకోకుండా వుంటారా.? అదే, తెలంగాణలోనూ జరుగుతోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకి తెలియకుండా వుంటుందా.? తెలిసీ ఎందుకు షర్మిల సంయమనం కోల్పోయినట్లు.?

తెలంగాణ సమాజంలోకి ఈ ‘పోలీస్ చెంప పగలగొట్టిన’ వ్యవహారం లోతుగా వెళ్ళిపోయింది. ‘రాజకీయాలకు ఇలాంటోళ్ళు సరిపోరు..’ అన్న చర్చ జరుగుతోంది. షర్మిల సంగతి సరే, వైఎస్ విజయమ్మ కూడా ఎందుకు సంయమనం కోల్పోయారో ఏమో.! ‘ఇది మరీ టూమచ్’ అంటున్నారు వైఎస్ విజయమ్మ గురించి.

షర్మిలకైనా, విజయమ్మకైనా భద్రత ఇచ్చేది తెలంగాణ పోలీసులే. ఆ పోలీసుల మీద చెయ్యి చేసుకోవడమంటే చిన్న విషయం కాదు. ‘పొరపాటు జరిగిపోయింది.. బేషరతు క్షమాపణ’ అని ఇద్దరూ ఒప్పేసుకుంటే, అదే హుందాతనం.!