కొత్త టాపిక్: బాలయ్యకే దిక్కులేదు.. బుడ్డోడెంత?

నందమూరి అభిమానులు కళ్లు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికీ తెరవకపోతే మీ అంత అమాయకులు ఎవరూ లేరు అనే కామెంట్లు తాజాగా ఆన్ లైన్ వేదికగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం మహానాడులో నందమూరి వారసులకు దొరికిన ప్రాధాన్యత!

చాలామంది నందమూరి అభిమానులు తెగ ఫీలయిపోతుంటారు. జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీలో విలువైవ్వడం లేదని, తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని, వాడుకుని వదిలేస్తున్నారని అంటుంటారు. అయితే బాలకృష్ణ పరిస్థితి కూడా అదే అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. “జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం బయటకు కనిపిస్తుంటుంది.. బాలయ్యది కనిపించదు అంతే తేడా.. మిగిలిందంతా సేం టూ సేం” అని అంటున్నారు పరిశీలకులు.

వివరాళ్లోకి వస్తే… నందమూరి వంశం తరపున తెలుగుదేశంపార్టీలో యాక్టివ్ గా ఉండే ఒకే ఒక్కడు నందమూరి బాలకృష్ణ. హిందూపురం ఎమ్మెల్యేగా ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులూ గట్రా ఏమీ లేకపోయినా… ఎన్టీఆర్ వారసుడొకరు అసెంబ్లీలో ఉన్నారు అంతే చాలు అని పెద్దాయన ఫ్యాన్స్ సంతోషపడుతుండేవారు.

అయితే తాజాగా బాలకృష్ణకు కూడా వెన్నుపోటు స్టార్ట్ చేశారు చంద్రబాబు. టీడీపీ అంటే నారా… నారా అంటే టీడీపీ అనే పథకం రచించారు! ఫలితంగా మచ్చుకు నందమూరి వంశంలో బ్రతికున్న వారి ఒక్క ఫోటో అంటే ఒక్కఫోటో కూడా కనిపించకుండా జాగ్రత్తపడ్డారు! అవును… రాజ‌మండ్రిలో జ‌రిగిన టీడీపీ మహానాడులో సజీవంగా ఉన్న నందమూరి వారసుల ఫోటో ఎక్కడా కనిపించలేదు. మహానాడు సందర్భంగా టీడీపీ ఇచ్చిన పేప‌ర్ ప్రకటనల్లోనూ.. అడ్వర్టైజ్మెంట్లలోనే కాదు.. చివరకు మహానాడు వేదిక మీద కూడా బాలయ్య కనబడలేదు.

వేదికమీద ఒకవైపు ఎన్టీఆర్ ఫొటో మరోవైపు చంద్రబాబునాయుడు ఫొటో మాత్రమే ఉంది. మధ్యలో ఉన్న పెద్ద పోస్టర్ లో ఎన్టీఆర్ – చంద్రబాబు – లోకేష్ ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. అడ్వర్టైజ్మెంట్ లో ముగ్గురి ఫొటోలకు పైన ఎడమవైపున ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కుడివైపున తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఫొటోలున్నాయంతే. కిందభాగాన కొందరు ముఖ్య నేతల ఫోటోలు కూడా ఉన్నాయి. ఎక్కడా బాలయ్య కనిపించలేదు!

దీంతో నందమూరి తారకరామారావు వారసులకు ఏమాత్రం %$#@* లేదు అని ఆన్ లైన్ వేదికగా ఆవేదన చెందుతున్నారు అసలు సిసలు అన్నగారి అభిమానులు. మరి ఈ విషయాలు బాలయ్యకు తెలిసాయా.. తెలిసినా పిల్లనిచ్చిన పాపానికి పైకి చెప్పుకోలేక ఊరకుండిపోయారా… అదీగాక టీడీపీలో నందమూరి వారు ఎంత తగ్గితే అంత మంచిదని బాలయ్యను బాబు ఒప్పించారా అనే చర్చ ఆన్ లైన్ వేదికగా తీవ్రంగా జరుగుతుంది!