‘RRR’ ఎఫెక్ట్ : బెర్త్ కన్ఫర్మ్ చేస్తున్న ఓ బిగ్ సినిమా..!

ఏ సినిమా ఇండస్ట్రీ లో అయినా కూడా పలు భారీ సినిమాలు వస్తున్నాయి అంటే ఇంకొన్ని సినిమాలు తప్పుకోవాల్సిందే.. ఇది అందరికీ తెలిసిందే. అలాగే ఎలాంటి సినిమా ఉన్నా కొన్ని రిలీజ్ అయ్యి హిట్ అయ్యినవి కూడా ఉన్నాయి. కాకపోతే ఈ కేసులు చాలా తక్కువ. కానీ వచ్చే ఏడాది టాలీవుడ్ దగ్గర సంక్రాంతి మాత్రం మరో లెవెల్లో ఉండబోతుంది.

ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ రాజమౌళి ట్రిపుల్ ఆర్(RRR) సినిమా డేట్ అనౌన్స్ చేయడంతోనే పలు సినిమాలకు టెన్షన్ పట్టుకుంది. మరి చాలా సినిమాలు ఈ రేస్ నుంచి వాయిదా పడతాయని అంతా అనుకున్నారు. ఇక ఈ లిస్ట్ లో మొదటి సినిమాగా వెంకీ మామ మరియు వరుణ్ తేజ్ లతో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ” ఎఫ్ 3″ ఇప్పుడు బెర్ట్ కన్ఫర్మ్ చేసుకుంది.

ముందు నుంచీ సంక్రాంతి రేస్ లోనే వచ్చి మళ్ళీ హిట్ కొడదాం అనుకున్న ఏఈ చిత్రాన్ని చిత్ర బృందం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీనితో రాజమౌళి సినిమా వల్ల ఓ సినిమా ఆల్రెడీ తప్పుకున్నట్టు అయ్యింది. ఇక మిగతా సినిమాల పరిస్థితి ఏమిటో చూడాలి.