కేసీఆర్, జగన్ ల పతనంపై గురి

abn radha krishna Target on KCR And Ys jagan
 
“కలలు కనండి…వాటిని సాకారం చేసుకోండి” అని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మహాశయుడు ఇచ్చిన పిలుపు యువతరాన్ని ఎంతో ప్రభావితం చేసింది ఒకప్పుడు.  మన క్షుద్రజ్యోతి ప్రబుద్ధుడు మాత్రం దాన్ని మరోకోణంలో అర్ధం చేసుకున్నట్లున్నాడు.  పగటి కలలు కంటూ అవి సాకారం కావాలని తపించిపోతున్నాడు.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణాలో చంద్రబాబు ప్రాయోజిత మహాకూటమి అధికారంలోకి వస్తుందని, ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని కోట్లు ఖర్చు చేసి చెప్పించిన చిలక జోస్యాలు విఫలం కావడంతో గంగవెర్రులెత్తి, పిచ్చెత్తి, జుట్టు పీక్కుంటూ వారానికోసారి భోరుభోరుమంటూ రోదనలు చెయ్యడం, రక్త విరేచనాలు చేసుకోవడం మామూలైంది.  ఆ వరుసలో ఈరోజు “హస్తినపై గురి” అంటూ తన మస్తిష్కం లోని బూజును బయటపెట్టుకున్నారు! 
 
abn radha krishna Target on KCR And Ys jagan
abn radha krishna Target on KCR And Ys jagan
“విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒక సందర్భంలో.. తెలంగాణ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి కమీషన్లు తీసుకుంటోందని వ్యాఖ్యానించారట. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరికించడానికి అవసరమైన సమాచారాన్ని బీజేపీ అధినాయకత్వం సేకరించినట్టు చెబుతున్నారు.”
 
 
ఒకవంక విశ్వసనీయ సమాచారం అంటాడు రాధాకృష్ణ.  మరో వాక్యంలో ‘ట” కార ప్రయోగాన్ని చేస్తూ తన మానసికవికారాన్ని ప్రదర్శిస్తాడు.  కేసీఆర్ కమీషన్లు తీసుకుంటున్నారని నరేంద్ర మోడీ ఎప్పుడు ఎక్కడ వ్యాఖ్యానించారో మనకు తెలియదు కానీ, “పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎం లా వాడుకుంటున్నాడు” అని నరేంద్ర మోడీ బహిరంగసభలోనే వ్యాఖ్యానించడం మనకు తెలుసు.  అయినప్పటికీ, చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేకపోయాయి ఈ దేశంలోని చచ్చుబడిన వ్యవస్థలు.  ఇక కమీషన్లు తీసుకుంటున్నారని కేసీఆర్ ను ఇరికిస్తామంటే   దేనితో  నవ్వాలి?    ఆయన  కమీషన్లు తీసుకున్నట్లు  ఆధారాలను  బయటపెట్టకుండా ఉంటారా తెలంగాణ బీజేపీ నాయకులు? 
 
***. 
 
“తాము భావిస్తున్నట్టు సీబీఐ విచారణకు న్యాయస్థానం ఆదేశిస్తే.. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేయవలసి వస్తుందనీ, అప్పుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనీ, అదే జరిగితే పార్టీలో చీలికను ప్రోత్సహించాలన్నది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. చీలిక వర్గంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జెండా ఎగురవేయాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. “
 
హ్హాహ్హా…అదేమిటో తమాషా….దేశంలోని అన్ని రాజకీయపార్టీల వ్యూహాలు, రహస్యసమావేశ వివరాలు అందరికంటే ముందుగా మన రాధాకృష్ణకు తెలుస్తాయి.  ఇంటిలిజెన్స్ వారికి కూడా లేని ఏనుగు చెవులు రాధాకృష్ణకు జన్మతహా వచ్చినట్లుంది.  బ్యాంకులకు ఆరువేల కోట్ల రూపాయలను ఎగగొట్టిన ఆర్థికఉగ్రవాదులను అక్కున చేర్చుకున్న కమలనాధులు ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని  కేసీఆర్ మీద సిబిఐ విచారణ చేయిస్తారనడం హాస్యాస్పదంగా లేదూ?  పైగా సిబిఐ విచారణకు ఆదేశిస్తే రాజీనామా చెయ్యాలా?  ఏ చట్టంలో ఉన్నది ఆ నిబంధన?  తన మీద విచారణకు ఆదేశిస్తే కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారా?  లేకపోతె చెయ్యరా?   సిబిఐ విచారణకు ఆదేశిస్తే తెరాస చీలిపోతుందా!  ఎదుటివారి చెవుల్లో పువ్వులు పెట్టడం అంటే ఇదే కదా!  
 
 ****
 
“తాను తొలి ముఖ్యమంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం, రైతుబంధు పథకం అమలుచేయడంతో పాటు యాదాద్రి నిర్మాణం పూర్తి చేశానన్న సంతృప్తితో అధికారం నుంచి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఇక తాను చేయగలిగింది, చేయాల్సింది ఏమీ లేదు కనుక ప్రజల్లో తన పరపతి పతాక స్థాయిలో ఉన్నప్పుడే అధికారం నుంచి తప్పుకొంటే తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవచ్చునని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారట.”
 
 తొలి ముఖ్యమంత్రిగా కాళేశ్వరాన్ని పూర్తి చేసి, రైతుబంధు పథకంతో  పాటు యాదాద్రిని కూడా పూర్తి చేశారు కాబట్టి ఇక కేసీఆర్ తప్పుకోవాలా?  అంటే ముఖ్యమంత్రిగా ఒక ప్రాజెక్ట్, ఒక గుడిని కట్టిస్తే ఇక రాష్ట్రానికి చెయ్యాల్సింది ఏమీ ఉండదా రాధాకృష్ణా?  మరి పదునాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన చంద్రబాబు ఏమైనా ఒక్కటి చేశాడా?  అందుకేనా ఆయన ఇంకా ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతున్నాడు?  చంద్రబాబు ఏమీ చెయ్యలేదు అని, కేసీఆర్ చాలా చేశారని అంగీకరిస్తున్నారు రాధాకృష్ణ.  ముఖ్యమంత్రిగా కేసీఆర్ పరపతి పతాకస్థాయిలో ఉన్నాడని రాధాకృష్ణ ఒప్పేసుకుంటున్నాడు!  పై పేరాల్లోనే గదా అవినీతి, కమీషన్లు అంటూ కేసీఆర్  మీద బురద చల్లావు!  మళ్ళీ ఇంతలోనే అందుకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఏమిటి?  
 
***
 
“బీజేపీ నాయకులు భావిస్తున్నట్టుగా నిజంగా తనపై విచారణ జరిగి, ఆ కారణంగా రాజీనామా చేయాల్సి వస్తే అది తలవొంపుగా ఉంటుంది. కనుక వీలైనంత త్వరగా కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనకు కేసీఆర్‌ వచ్చినట్టు చెబుతున్నారు. యాదాద్రిలో యాగం నిర్వహించిన తర్వాత లేదా నూతన సచివాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడం ఖాయమని చెబుతున్నారు”
 
రాధాకృష్ణ మానసిక స్థితి ఏమాత్రం అదుపులో లేదని, ఆయన క్షణక్షణానికి తన వైఖరిని ఎలా మార్చుకుంటారో ఈ వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి.  సిబిఐ విచారణ జరిగిందే అనుకుందాం.  అది ఒక నెల లేదా రెండు నెలల్లో తేలిపోతుందా?  గత పాతికేళ్లలో సిబిఐ ఒక విచారణ చేసి ఎంతమందిని నేరస్తులుగా నిర్ధారించిందో, ఎంతమందికి శిక్షలు పడ్డాయో వివరాలు ఇవ్వగలరా రాధాకృష్ణ గారు?  అప్పుడే   కేసీఆర్ మీద సిబిఐ విచారణ జరిగినట్లు, ఆయన తలవంపులుగా  భావించినట్లు….ముఖ్యమంత్రి పదవికి  రాజీనామా  చేసినట్లు    …ఓహోహో  …ఎన్నెన్ని రంగుల స్వప్నాల్లో  తేలిపోతున్నాడో!  ఎన్నెన్ని స్వైరకల్పనలో!!!
 
 ****
 
“అంతర్వేదిలో స్వామివారి రథం కాలిపోయిన దుర్ఘటనను ఆసరాగా చేసుకుని హిందువుల మనోభావాలను తమకు అనుకూలంగా మలచుకోవడం కోసం ఇప్పటికే రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు, క్రైస్తవులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటున్నారు. మిగతా వర్గాలవారు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. “
 
అంతర్వేది రధం కాలిపోవడం నిన్నటిదాకా కుట్ర అన్న రాధాకృష్ణ నేడు దాన్ని దుర్ఘటనగా మార్చేశారు!   మరి ఎక్కడో ఒక చోట దుర్ఘటన జరిగితే దానికి జగన్ కు ముడి పెట్టడం ఎలా కుదురుతుంది?  ఆ దుర్ఘటనను ఆసరాగా చేసుకుని బీజేపీ హిందువులను రెచ్చగొడుతున్నదని రాధాకృష్ణ నాలుక జారాడు పాపం!  ముస్లిములు, క్రైస్తవులు జగన్ కు అండగా ఉంటున్నారట!  ఇక తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న ఆ మిగతా వర్గాలవారు ఎవరు?  దళితులా, ఎస్సీలా, ఎస్టీలా?  కాపులా?  ఎవరు నాయనా  వారు?  
 
****
“జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఈ పిటిషన్‌పై విచారణలో కదలిక వచ్చింది. తర్వాత ఆయన పదవీ విరమణ చేయడం, ఐదారు నెలలుగా కొవిడ్‌ కారణంగా ఈ పిటిషన్‌లో కదలిక లేకుండా పోయింది. “
 
సదరు పిటిషన్ 2015 లో అశ్వనీకుమార్ అనే ఒక పెద్దమనిషి వేశారట!  మరి అప్పటినుంచి కోవిద్ ఉన్నదా మనదేశంలో?  అయిదేళ్లనుంచి ఆ కేసు విచారణకు ఎందుకు రాలేదు?  ఎవరు అడ్డుకున్నారు?  కోవిద్ ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్  హైకోర్టులో జగన్ కు వ్యతిరేకంగా వచ్చే ప్రతి పిటీషన్ ను నిముషాల మీద విచారించడం లేదా?  కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటె అవినీతిపరులను విచారించే పిటీషన్ ను విచారించడం ఎంత సేపు?   తాను  పదవీవిరమణ  చేయబోయే  చివరి  రోజున  కూడా అనేక  కేసుల  పై కేంద్రానికి అనుకూలంగా సంచలనాత్మకమైన తీర్పులు ఇచ్చి పదవీ  విరమణ  కాగానే రాజ్యసభ సభ్యతాన్ని కానుకగా పుచ్చుకున్న గగోయ్ తలచుకుంటే అవినీతిపరులపై విచారణ కేసులో కూడా ఒక తీర్పు ఇవ్వడం ఎంతసేపు?   
 
 ***
“ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఆకర్షణీయమైన మరో నినాదం కావలసి ఉంటుంది. ఈ కారణంగా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి కేంద్రప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయవచ్చు. గతంలో ప్రకటించినట్టు ఏడాదిలోపు విచారణ పూర్తి కావడానికి చర్యలు తీసుకోవచ్చు. అదే జరిగితే బీజేపీకి చెందిన కొంతమంది నాయకులకు కూడా శిక్ష పడవచ్చు.  రాజకీయాలను ప్రక్షాళన చేశామన్న కీర్తిని మాత్రం సొంతం చేసుకోవచ్చునని నరేంద్ర మోదీ భావించవచ్చు.”
 
 పేలపిండి అమ్ముకుని కోట్లు సంపాదించవచ్చు అని గాలిమేడలు కడుతూ  ఆ పేలపిండి కుండను   కాలితో  తన్ని  నేలపాలు చేసుకున్న బ్రాహ్మణుడి మాదిరిగా రాధాకృష్ణ కూడా మందు తాలూకు మత్తు  ఎక్కువై ఊహాగానాల్లో మునిగితేలుతున్నారు. అది జరగొచ్చు….ఇది జగరొచ్చు …అంటూ తనకు తనలో తానే నవ్వుకునే పిచ్చోడిలా  వ్యవహరిస్తూ పరువు వీధిపాలు చేసుకుంటున్నాడు.  మనమూ రాయొచ్చు…రేపు  రాధాకృష్ణ మీద కేసీఆర్ కేసులు  పెట్టొచ్చు…పోలీస్  స్టేషన్లో  తల్లకిందులుగా వేలాడదీసి అట్లకాడలు కాల్చి  వాతలు పెట్టొచ్చు….బూటు కాళ్లతో తన్నొచ్చు …నడిరోడ్డు మీద లాఠీతో  బాదుతూ కోర్టుకు తీసుకెళ్లొచ్చు….ఇలా ఇలా మనమూ కలలు కనవచ్చు… 
 
 ****
 
“తెలుగునాట కూడా కొంతమంది మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలపై కేసులు పెండింగులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయనపై నమోదైన కేసులు దాదాపు పదేళ్లుగా పెండింగులో ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో కల్పించిన వెసులుబాట్లను ఉపయోగించుకొని విచారణ వేగవంతం కాకుండా జగన్‌ అండ్‌ కో నిలువరించగలిగారు.”
 
ఎంతెంత  సొల్లు  కార్చినా  మళ్ళీ  ఏదో ఒక సందర్భంలో జగన్మోహన్ మీద కేసులు ఉన్నాయి అని చెప్పడం మాత్రం మరచిపోదు రాధాకృష్ణ.  ఎందుకంటే ఆ భావన బర్రెకు పట్టిన గోమారులా రాధాకృష్ణ మనసులో  పీకుతూనే ఉంటుంది మరి!   మరి చంద్రబాబు సంగతేమిటి?  చంద్రబాబు మీద కేసుల తాలూకు స్టే  లు  పాతికేళ్ళనుంచి కోర్టుల్లో     నలిగిపోతున్నాయి.   సుప్రీమ్  కోర్ట్ చెప్పినా   కూడా ఆ సత్యాలు  తొలిగిపోవడం  లేదు.  విచారణ అంటూ మొదలుపెడితే మొట్టమొదటిసారిగా విచారించాల్సింది చంద్రబాబు మీదనే.  ఆ దమ్ము దేశంలో ఎవ్వరికీ  లేదనే  విషయం  అందరికీ  తెలిసిందే.   న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులను చంద్రబాబు ఉపయోగించుకున్నంతగా దేశంలో మరే నాయకుడూ ఉపయోగించుకోలేదన్నది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత వాస్తవం.  ఆ తెలివిడి లేకపోవడంతోనే జయలలిత, మధుకోడా, లాలూ ప్రసాద్ లాంటివాళ్లు జైలుకు వెళ్లారు.  జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు రిమాండ్ ఖైదీగా ఉన్నారు!  
 
***
“కేంద్ర ప్రభుత్వ స్పందనను బట్టి రాజకీయాల్లోని నేరస్థులపై విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చే ఏడాది చివరినాటికి జగన్‌రెడ్డిపై ఉన్న కేసులలో విచారణను పూర్తిచేయాలి. అవినీతి ఆరోపణలు రుజువైన పక్షంలో ముఖ్యమంత్రికి శిక్ష పడుతుంది. “
 
అదీ మన రాధాకృష్ణ గారి వాంఛ!  వచ్చే ఏడాదిలోగా జగన్ జైలుకు వెళ్లాలని,  చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయి అమరావతి పేరుతో దోచుకోవాలని రాధాకృష్ణగారి కోరిక!  రుజువైతే శిక్ష పడుతుందట.  మరి రుజువు కాకపోతే ఏమి జరుగుతుందో కూడా చెప్పాలి కదా?  మరి చంద్రబాబుపై విచారణ కూడా జరిగితే ఆయనకు ఎంత శిక్ష పడుతుందో, ఏ జైలుకు వెళ్తాడో కూడా రాధాకృష్ణ చెప్పాలి కదా!  
 
***
“ఆ కారణంగానే తన బెయిల్‌ రద్దయినా, అవినీతి కేసులలో శిక్ష పడినా తన స్థానంలో భార్య భారతిరెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది! అయితే జగన్‌రెడ్డికి భారతిరెడ్డి ప్రత్యామ్నాయం కాగలరా? అన్న సందేహం అధికార పార్టీ నాయకులను వేధిస్తోంది. “
 
అహో..ఏమి కల్పనాచాతుర్యం!  తాను జైలుకు వెళ్తే తన భార్యను ముఖ్యమంత్రిని చెయ్యాలని జగన్ నిర్ణయించుకున్నట్లు రాధాకృష్ణకు తెలిసిందంటే జగన్ పడకగదిలో తప్పకుండా రాధాకృష్ణ కెమెరాలు ఉండి ఉండాలి!   ఇక జగన్ కు భారతి  ప్రత్యామ్నాయం   కాగలరా  అనే మరొక గొప్ప ధర్మసందేహం కూడా రాధాకృష్ణకు కలుగుతున్నది !   పాపం  ఆమెకు మంగళగిరిని “మందలగిరి”  అని పలకడం కూడా చేతకాదాయే!  ఆవిడేమైనా రామలింగరాజు సొమ్ముతో అమెరికాలో చదువుకున్నదా?   పరమశుంఠ లోకేష్ మూడు మంత్రిత్వశాఖలు నిర్వహించినపుడు ఉబ్బిపోయిన బ్రెడ్ లాంటి నాలుక కలిగిన లోకేష్,  మాట్లాడటం కూడా రాని లోకేష్ ఆ మూడు పదవులను ఎలా నిర్వహించగలడు అనే సందేహం కూడా రాధాకృష్ణకు రాలేదే!   అప్పుడే జగన్ జైలుకు వెళ్లినట్లు…భారతీరెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తున్నట్లు…హహ్హాహ్హా….రాధాకృష్ణకు ఉన్మాదం విపరీతంగా పెరిగిందని ఇక వేరే చెప్పాలా?  
 
***
ఒక కంట్లో కాబేజీలాగా కేసీఆర్…మరొక కంట్లో కాలీఫ్లవర్ లాగా జగన్…రాత్రి నిద్రపట్టకుండా చేస్తుండటంతో రాధాకృష్ణకు నిద్రలో నడిచే జబ్బు సోకినట్లుంది.  అమ్మవారు పూనినవారు కొరడాలతో తమను తామే కొట్టుకుంటూ ఎలా కాలక్షేపం కలిగిస్తారో రాధాకృష్ణ కూడా అలాగే రెండు తెలుగు రాష్ట్రాలవారికి  తనదైన కేతిగాడి శైలిలో బోలెడు  వినోదం కురిపిస్తున్నాడు!   ఆల్   ది  బెస్ట్  రాధాకృష్ణా !   
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు