‘RRR’ నుంచి పండుగ కానుక వస్తుందా..?

దర్శక దిగ్గజం రాజమౌళి అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తీసిన భారీ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR). భారతదేశ వ్యాప్తంగా అంచనాలు నెలకొల్పుకున్నా ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా వచ్చే ఏడాది జనవరికి ఫిక్స్ కాగా ఇప్పుడు మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ ఈ సినిమాపై వినిపిస్తున్నాయి. ఆల్రెడీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా ఇపుడు రాబోతున్న దీపావళి పండుగ కానుకగా ఓ బిగ్ అప్డేట్ రాబోతున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ మరియు చరణ్ లపై డిజైన్ చేసిన ఒక కంబైన్డ్ టీజర్ ను చిత్ర యూనిట్ ఈ దీపావళి కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంకా ఇందులో ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ టాక్ అయితే వైరల్ అవుతుంది. పైగా సినిమా రిలీజ్ కి టైం కూడా తక్కువ ఉన్నందున ఏమో ఇప్పుడు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కొన్ని రోజుల్లో వారు ఏమన్నా చెప్తారో లేదో చూడాలి ఇక.