చాణక్యుడి నీతి శ్లోకాల ప్రకారం.. లక్షిదేవి ఇలాంటి ప్రదేశాలలో కొలువై ఉంటుంది..?

ప్రస్తుత కాలంలో ప్రపంచం మొత్తం డబ్బు చుట్టే ఆధారపడి నడుస్తోంది. అందువల్ల డబ్బులు సంపాదించడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే కొందరు ఎంత కష్టపడి పని చేసినా కూడా డబ్బులు సంపాదించలేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే అలాంటివారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి లక్ష్మీదేవిని పూజించాల్సి ఉంటుంది. ఇలా లక్ష్మీదేవిని పూజించి ఆ దేవి అనుగ్రహం పొందినవారు ఎప్పుడూ ధన ధాన్యాలతో తులుతుగుతారు. అయితే చాణక్యుడి నీతి శ్లోకాల ప్రకారం లక్ష్మీదేవి కొన్ని ప్రదేశాలలో మాత్రమే కొలువై ఉంటుంది. ఆ ప్రదేశాల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహార ధాన్యాల కొరత:

చాణక్యుడి నీతి శ్లోకాల ప్రకారం ఇంట్లో వంటగది ఎప్పుడు ఆహార ధాన్యాలతో నిండుగా ఉన్న ఇంట్లో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువై ఉంటారు. అందువల్ల ఇంటి వంట గదిలో ఎల్లప్పుడూ ధాన్యం నిల్వ ఉండేలా అంతేకాకుండా మనం తినే ఆహారం పట్ల ఎంతో గౌరవంగా ప్రవర్తించాలి. పొరపాటున కూడా మనం తినే ఆహారం పట్ల ఆ గౌరవంగా ప్రవర్తించడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అందువల్ల భోజనాన్ని ఎప్పుడు అగౌరవపరచకూడదు.

మూర్ఖుల సంఘం:

సాధారణంగా కొందరు మూర్ఖుల మాటలు విని తమ లక్ష్యాలను పక్కనపెట్టి జీవితంలో పనీపాటా లేకుండా కాలక్షేపం చేస్తూ ఉంటారు. అలా కాకుండా మూర్ఖుల మాటలు వినకుండా జీవితంలో లక్ష్యం సాధించటం కోసం కష్టపడే వ్యక్తికి లక్ష్మీదేవి అనుగ్రహంఎల్లప్పుడు ఉంటుంది. అందువల్ల మూర్ఖుల సావాసానికి దూరంగా ఉంటూ జీవితంలో లక్ష్యసాధన కొరకు కష్టపడుతూ విజయం సాధించడానికి కృషి చేసిన వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

కుటుంబంలో ప్రేమ:
కుటుంబం సభ్యుల మధ్య ఐక్యత సౌభాగ్యానికి సంకేతం. కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఒకరిపట్ల ఒకరు పరస్పర ప్రేమ, సోదరభావం ఉన్న చోట, లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చాణక్యుడి నీతి శ్లోకాలు వివరించబడింది. ఇలా కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉండటం వల్ల ఆ కుటుంబంలో లక్ష్మీదేవి కొలువై ఉండి డబ్బుకు కొరత ఉండదు. ఇలా కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు ప్రేమానురాగాలతో సహాయ సహకారాలు అందించుకుంటూ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవితో పాటు అన్నపూర్ణాదేవి కూడా కొలువై ఉంటుంది.