‘డియర్ కామ్రేడ్’విడుదల తేదీ ఖరారు

విజయ్ దేవరకొండ హీరోగా .. భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘గీత గోవిందం’ తరువాత విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా నటిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గా నటిస్తుండగా .. రష్మిక క్రికెటర్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగ్ ను జరుపుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని కీలకమైన సీన్స్ చిత్రీకరిస్తున్నారు.

మే 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్లు సమాచారం. రీసెంట్ గా ఈ చిత్రం కు రీషూట్స్ చేస్తున్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటివరకూ తీసిన రష్ ని చూసుకున్న విజయ్ దేవరకొండ, నిర్మాతలు అసంతృప్తిగా ఫీలయ్యారని,అందుకే రీషూట్ అని సారాంశం.

డియర్ కామ్రేడ్ చిత్రాన్ని భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి జైకృష్ణ మాటలు రాస్తున్నారు.

రామాంజనేయులు ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: భరత్ కమ్మ, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరామెన్: సుజిత్ సరంగ్, ఎడిటర్: శ్రీజిత్ సరంగ్, డైలాగ్స్: జైకుమార్, బ్యానర్స్: మైత్రి మూవీమేకర్, బిగ్‌బెన్ సినిమాస్ నిర్మాతలు: నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చిరుకూరి (సి.వి.ఎం), యస్.రంగినేని.