స్టార్ హీరోలు రజనీకాంత్, అక్షయ్ కుమార్ కలిసి నటించిన ‘2.0’. ఈ సినిమా ప్రతీ విషయంలో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ..ఇప్పటికే బుకింగ్ ద్వారా దాదాపు రూ.120 కోట్లు రాబట్టినట్లు సమాచారం.
ఈ సినిమా మన దేశంలో 7,500 స్క్రీన్లలో విడుదల కాబోతోందట. ఉత్తర అమెరికాలో 850 స్క్రీన్లు, యూకేలో 300 స్క్రీన్లు, యూరప్‌లో 500 స్క్రీన్లు, దక్షిణ ఆసియాలో 100 స్క్రీన్లు, ఆసియా- పసిఫిక్‌లో 900 స్క్రీన్లు.. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10,500 స్క్రీన్లపై విడుదల కాబోతున్నట్లు సమాచారం.
అలాగే పాకిస్థాన్‌లోనూ ఈ సినిమా రిలీజ్ కు సీబీఎఫ్‌సీ అనుమతి ఇచ్చింది. అక్కడ దాదాపు 75 స్క్రీన్లలో చిత్రం విడుదల కాబోతోందట. అక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైందని, అద్భుతమైన స్పందన లభించిందని చిత్ర యూనిట్ చెప్తోంది.
అలాగే ఈ సినిమా మార్నింగ్ షోను ఉదయం 4.30 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. తిరుచ్చిలోని వివిధ స్క్రీన్లలో ఉదయం 4.30 నుంచి 9 గంటలలోపు 20 కన్నా ఎక్కువ షోలను వేయాలని డిస్టిబ్యూటర్స్ భావిస్తున్నారట. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తారని, తిరుచ్చిలో 20 కన్నా ఎక్కువ మార్నింగ్ షోలకు సన్నాహాలు చేస్తున్నారని చెప్తున్నారు.
అంతేకాదు దుబాయ్‌లోని అతిపెద్ద మల్టీప్లెక్స్ VOX సినిమాస్‌లో ‘2.0’ను రోజుకు 100 షోల కంటే ఎక్కువ ప్రదర్శించడానికి డిస్టిబ్యూటర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఏ రేంజిలో సంచలనం సృష్టించబోతో అర్దం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
2010 సూపర్ హిట్ ‘రోబో’కు స్వీక్వెల్‌గా వస్తోన్న చిత్రం ‘2.ఓ’. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషించారు. అమీ జాక్సన్ హీరోయిన్. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. భారత చిత్ర పరిశ్రమలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.