జెర్సీ రీమేక్ బ‌రిలో దిగ్గ‌జాలు

`జెర్సీ` రీమేక్ ప్లాన్ వ‌ర్క‌వుట‌య్యేనా?

ఈ మద్య కాలంలో తెలుగు సినిమా క్వాలిటీ పెరిగిందనే చెప్పాలి. బాలీవుడ్ కోలీవుడ్ నిర్మాతలు, హీరోలు మన తెలుగు సినిమాల రీమేక్ హక్కులకోసం తీవ్రంగా పోటి పడుతున్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయినా అర్జున్ సింగ్ రీమేక్ కబీర్ సింగ్ బాలీవుడ్ లో విధ్వంసం స్రుష్టించిందనే చెప్పాలి.

ఆ కోవలోకే మరో తెలుగు చిత్రం చేరబోతున్నది. నాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ 2019 ప్రథమార్థంలో వచ్చిన తెలుగు సినిమాల్లో జెన్యూన్ హిట్. జెర్సీ గౌతమ్ టిన్ననురి రచన మరియు దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం. సూర్యదేవర్ నాగ వంశీ తన ప్రొడక్షన్ బ్యానర్ సీతారా ఎంటర్టైన్మెంట్స్ క్రింద నిర్మించారు.తెలుగులో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే సినిమా అయిపోయిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు నిలబడి చప్పట్లుకొట్టేంత .

ఇంత పెద్ద హిట్ అయినా తర్వాత ఈ సినిమా రీమేక్ చెయ్యకుండా వదలరు కదా. `జెర్సీ` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు మెగా నిర్మాత అల్లు అరవింద్ ఇప్ప‌టికే ఆస‌క్తిని క‌న‌బ‌రిచార‌ని ప్ర‌చార‌మైంది. అల్లు అర‌వింద్ – సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా `జెర్సీ`ని బాలీవుడ్ లో రీమేక్ చేయ‌నున్నాయ‌ని తెలుస్తోంది.

అలాగే కోలీవుడ్ లో ఈ సినిమాని రీమేక్ చేసేందుకు యువ‌హీరో రానా స‌న్నాహ‌కాల్లో ఉన్నారట‌. త‌మిళంలో `ర‌చ్చాస‌న్` ఫేం విష్ణు విశాల్ హీరోగా న‌టించ‌నున్నారు. ఆ మేర‌కు ద‌గ్గుబాటి కాంపౌండ్ నుంచి స‌మాచారం అందింది. ఇటీవ‌ల రానా వ‌రుస‌గా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్ని నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది `కేరాఫ్ కంచ‌రపాలెం` చిత్రంతో నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న రానా ఈ ఏడాది వ‌రుస‌గా ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. తాజాగా త‌మిళంలో `జెర్సీ` చిత్రంతో నిర్మాత‌గా కొత్త ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

భాష ఏదైనా మంచి కంటెంట్ ని ప్ర‌మోట్ చేసేందుకు రానా అన్నివేళ‌లా ముందుకు రావ‌డంపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇరుగు పొరుగు భాష‌ల్లో జెర్సీ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న‌ది ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలే కాబ‌ట్టి అక్క‌డా బాక్సాఫీస్ వ‌ద్ద ఏమేర‌కు హ‌వా సాగ‌నుంది? అన్న‌ది వేచి చూడాలి.