ఐపీఎల్‌లో తన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్ అండర్-19పై కూడా అదే జోరు కొనసాగించాడు. అయితే వైభవ్ విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18 ధరించి మైదానంలోకి దిగడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ రిటైర్ కాకముందే అతని జెర్సీ నంబర్ మరో క్రికెటర్ ధరించటం పై అభిమానులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఇండియా లిస్ట్-ఎ జట్లలో కచ్చితమైన జెర్సీ నంబర్ నియమాలు లేవని పేర్కొంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మాత్రమే జెర్సీ నంబర్ కాకూడదని వివరించింది. కాబట్టి ఎవరైనా ఇష్టమైన నంబర్ పెట్టుకోవచ్చుని అధికారులు తెలిపారు.
ఈ మ్యాచ్ లో మైదానంలో వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ జట్టుకి చుక్కలు చూపించాడు. కేవలం 19 బంతుల్లోనే 48 పరుగులు, అందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లు.. దాంతో మ్యాచే తేలిపోయింది. ఇంగ్లండ్ అండర్-19 ముందు ఇండియా అండర్-19 బలంగా నిలిచింది. అభిగ్యాన్ కుండు 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాకీ ఫ్లింటాఫ్ 56, ఇసాక్ మహ్మద్ 42 పరుగులు చేయగా మిగతావారు పెద్దగా సత్తా చూపలేకపోయారు. కనిష్క్ చౌహాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. హెనిల్ పటేల్, అంబ్రిష్, మహ్మద్ ఇనామ్ తలా రెండు వికెట్లు తీశారు. టార్గెట్ చేధనలో భారత్ ఆరంభం నుంచే దూకుడు చూపింది. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (21) కలిసి 71 రన్స్ జోడించి సాలిడ్ start ఇచ్చారు. మొత్తం 24 ఓవర్లలోనే 178/4తో మ్యాచును ముగించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
కోహ్లీ జెర్సీ వివాదం పక్కన పెడితే.. వైభవ్ సూర్యవంశీ ఆట అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ కుర్రాడి ఇన్నింగ్స్‌కి అభిమానులు సోషల్ మీడియాలో ఫిదా అవుతున్నారు. మరి ఈ కుర్రాడు ఆ ఫామ్‌ను నిలబెట్టుకుంటాడో చూడాలి..!