గతంలోలాగ హీరో, హీరోయిన్స్ మొహమాటపడి తన మనస్సులో విషయాలు దాచుకోవటం లేదు. ఏది మనస్సులో ఉంటే అది పైకి చెప్పేస్తున్నారు. అలాగే నీతులు చెప్పాలని అసలు అనుకోవటం లేదు. సమాజాన్ని ప్రతిబింబించేలా బిహేవ్ చేస్తున్నారు. యూత్ మనస్సు చూరగొంటున్నారు. అలాంటి వాళ్లలో రెజీనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
తెలుగులో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, శౌర్య, సౌఖ్యం, అ! లాంటి సినిమాలతో టాలీవుడ్ లో హిట్స్ లో చేసిన రెజీనా రీసెంట్ గా “ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా” చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో రెజీనా నటించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఆ సినిమాలో ఆమె లెబ్సియన్ గా కనిపించింది.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రెజీనా మీడియాతో మాట్లాడుతూ లెస్బియన్లపై తన అభిప్రాయం తదితర విషయాలను పంచుకుంది. అలాగే తన విషయంలో పెళ్ళి కానీ, నిశ్చితార్థం కానీ… వాటి గురించి బాహాటంగానే చెబుతానని, తాను జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నానే వార్తలు రూమర్స్ మాత్రమేనని స్పష్టం చేసింది.
రెజీనా మాట్లాడుతూ..“ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా” సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించడం ఆనందంగా ఉందని, తన స్నేహితుల్లో కొంతమంది లెబ్సియన్స్ ఉన్నారని.. సినిమా చూసి వారు ఎమోషన్ ఫీలయ్యారని తెలిపింది. ఇలాంటి సామాజికపరమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సినీ మాధ్యమం బలమైన శక్తిగా పని చేస్తుందని రెజీనా అన్నారు. తను మరిన్ని ఇలాంటి సినిమాల్లో నటించాలనుకుంటున్నట్లు తెలియచేసింది.