సోషల్ మీడియాపై జగన్ ప్రత్యేక దృష్టి

జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తొందరలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వారితో సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా అందుకనే సోషల్ మీడియాను పరుగులు పెట్టించాలని అనుకుంటున్నారట. రేపటి ఎన్నికల్లో గెలవాలంటే సోషల్ మీడియా పాత్ర ఏమిటో జగన్ కు బాగా అర్ధమైనట్లుంది. అందుకనే సోషల్ మీడియాపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. నిజానికి గడచిన నాలుగున్నరేళ్ళల్లో వైసిపి తరపున సోషల్ మీడియా విభాగం చాలా యాక్టివ్ గా ఉందనే చెప్పాలి.  పోయిన ఎన్నికల్లో ఇదే మీడియాను చంద్రబాబునాయుడు ఎంతగా వాడుకున్నాడో అందరికీ తెలిసిందే.  

పోయిన ఎన్నికల సమయంలో జగన్ సోషల్ మీడియాపై పెద్దగా దృష్టి పెట్టలేదు. దాంతో తెలుగుదేశంపార్టీ  సోషల్ మీడియాలో జగన్ కు వ్యతిరేకంగా రెచ్చిపోయింది. చంద్రబాబుకు అనుకూలంగాను జగన్ కు వ్యతిరేకంగాను రాజకీయాలతో సంబంధం లేని మధ్యతరగతి జనాలను టిడిపి వైపు మళ్ళించటంలో సోషల్ మీడియా బాగా సక్సెస్ అయ్యింది. 

అందుకనే ఈసారి ఆ అవకాశం టిడిపికి ఇవ్వదలచుకోలేదు జగన్.  కాబట్టే జగన్ నాలుగేళ్ళ క్రితమే సోషల్ మీడియాకు ప్రత్యేకంగా నిపుణులను నియమించుకున్నారు.  అందుకే నాలుగున్నరేళ్ళల్లో వైసిపికి మద్దతుగా సోషల్ మీడియా విభాగం రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో వైసిపి మద్దతుదారుల దెబ్బకు చంద్రబాబు, నారా లోకేష్ మండిపోతున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు సోషల్ మీడియా దెబ్బెలాగుందో. చివరకు వైపిపి మద్దతుదారుల్లో ఎంతో మందిని అరెస్టులు కూడా చేయించారు. 

అదే సమయంలో వైసిపికి పోటీగా జనసేన మద్దతుదారులు బాగా రెచ్చిపోతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రాంలో లక్షలాది మంది పవన్ అభిమానులు బాగా స్పీడుగా ఉన్నారు. పేస్ బుక్ లో అయితే పవన్ పేరుతో ఉన్న గ్రూపుల్లో లక్షలమంది అభిమానులున్నారు. పవన్ సినీ సెలబ్రిటీ కావటమే అందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. అభిమాన సంఘాల్లోని సభ్యులంతా గ్రూపుల్లో చేరిపోయి రచ్చ  చేసేస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాతే సోషల్ మీడియా విభాగంలో బాగా యాక్టివ్ గా ఉండే వారితో సమావేశమవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు. కాబట్ట జగన్ సమావేశం తర్వాత వైసిపి సోషల్ మీడియా ఏ స్ధాయిలో రెచ్చిపోతుందో చూడాలి.